Mumbai: కోటి మందిని చంపేస్తాం.. నిమజ్జనం వేళ ముంబైకు బాంబ్ బెదిరింపులు
- కోటి మందిని చంపేస్తాం
- నిమజ్జనం వేళ ముంబైకు బాంబ్ బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గణేష్ నిమజ్జనం వేళ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ బాంబ్ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 34 వాహనాల్లో ఆర్డీఎక్స్ పెట్టినట్లుగా వాట్సాప్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు బెదిరింపు వచ్చింది. ఒక కోటి మంది ప్రజలను చంపబోతున్నట్లు సందేశం వచ్చింది. దీంతో పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుని అప్రమత్తమైంది.
ఇది కూడా చదవండి: Trump: యుద్ధాలపై ట్రంప్ కొత్త పలుకు.. ఎన్ని ఆపారో సంఖ్య చెప్పిన అధ్యక్షుడు
Also Read
ముంబైలోకి 14 మంది ఉగ్రవాదులు ప్రవేశించారని.. 400 కిలోల ఆర్డీఎక్స్‌ను నగరంలో పలు వాహనాల్లో అమర్చారని బెదిరింపు సందేశం వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం పోలీస్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే నిమజ్జనం కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గురువారం వచ్చిన బెదిరింపు సందేశంతో అలర్ట్‌గా ఉన్నట్లు అధికారి చెప్పారు.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ విందులో గూగుల్ వ్యవస్థాపకుడు చిలిపి చేష్టలు.. ఏం చేశాడంటే..!
ఇక బెదిరింపుపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది. ఉగ్రవాద నిరోధక దళం (ATS), ఇతర సంస్థలకు కూడా సమాచారం అందించినట్లు అధికారి తెలిపారు. బెదిరింపు సందేశంలో ‘లష్కర్-ఎ-జిహాదీ’ అనే సంస్థ పేరును పంపించినట్లు అధికారి వెల్లడించారు. శనివారం ముంబైలో భారీగా నిమజ్జనాలు ఉన్నాయి. దీంతో లక్షలాది మంది ప్రజలు తరలిరానున్నారు. ముందు జాగ్రత్తగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు
ఇక ముంబై వాసులు పుకార్లను నమ్మవద్దని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉంటే వెంటనే తెలియజేయాలని పోలీసులు కోరారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
Mumbai Police say, "Traffic Police in Mumbai received threats over their official WhatsApp number. In the threat, a claim has been made that 34 'human bombs' have been planted in 34 vehicles across the city and the blast will shake entire Mumbai. The organisation, claiming to be…
— ANI (@ANI) September 5, 2025
తాజావార్తలు
-
Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!