సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రస్తుతం సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా అధికారులు మరింత ఆజ్యం పోస్తున్నారు. పుండి మీద కారం చల్లినట్లుగా రెచ్చగొట్టే ప్రేలాపనలు చేస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఇష్టానురీతిగా మాట్లాడుతుంటుంటే.. ఈయనకు మరో అమెరికా అధికారి తోడయ్యారు. వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ కూడా భారత్‌పై పరుష వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Honeymoon Murder Case: సోనమ్‌కు షాక్.. ఎన్ని పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారంటే..!
బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ టారిఫ్‌లపై హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ.. భారత్ ఒక నెల లేదా రెండు నెలల్లో భారతదేశం.. అమెరికాకు క్షమాపణ చెబుతుందని వ్యాఖ్యానించారు. భారతదేశమే చర్చలకు దిగొస్తుందని పేర్కొన్నారు.
రష్యా దగ్గర చైనా, యూరోపియన్ దేశాలు చమురు కొనుగోలు చేస్తుంటే.. భారత్‌పైనే ఎందుకు ఎక్కువ టారిఫ్ వేశారని ప్రశ్నించగా.. ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముందు భారత్.. 2 శాతమే రష్యా దగ్గర చమురు కొనుగోలు చేసేదని.. ఇప్పుడు 40 శాతం కొనుగోలు చేస్తుందని చెప్పుకొచ్చారు. దీంతో రష్యాకు బాగా డబ్బు వస్తుందని.. అందుకే రష్యా శాంతి ఒప్పందానికి రావడం లేదని లుట్నిక్ వివరించారు.
ఇది కూడా చదవండి: Imran Khan: జైలు దగ్గర ఇమ్రాన్‌ఖాన్ సోదరిపై కోడిగుడ్డు దాడి.. వీడియో వైరల్
ఒక విషయం ఏంటంటే చైనీయులు.. భారతీయులు మనకు అమ్ముతారు.. కానీ వారు మాత్రం ఒకరికొకరు అమ్ముకోరని తెలిపారు. కస్టమర్ ఎల్లప్పుడూ సరైనవాడని మనందరికీ తెలుసు.. అందుకే ఎప్పటికైనా భారత్.. యూఎస్ మార్కెట్‌కు తిరిగి రావాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. అందుకే రెండు నెలల్లో భారత్ క్షమాపణ చెప్పి.. ట్రంప్‌తో ఒప్పందాలు చేసుకుంటారని చెప్పుకొచ్చారు. ఒకవేళ చర్చలకు రాకపోతే మాత్రం 50 శాతం సుంకం భరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే రష్యా దగ్గరే చమురు కొనుగోలు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పేశారు.
Lutnick to #India: Drop Dead
Moments ago on @business: pic.twitter.com/Xik8HsaghM— Joel Lawson (@JoelLawsonDC) September 5, 2025