Modi-Trump: ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన మోడీ
- ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన మోడీ
- అధ్యక్షుడి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనను గొప్ప ప్రధాని అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇరు దేశాల సంబంధాలపై కూడా సానుకూల పరిణామాలను అభినందించారు.
ఇది కూడా చదవండి:Trump: బందీలను విడుదల చేయాలని హమాస్‌ను కోరాం.. లేకుంటే మాత్రం..!
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
భారత ప్రధాని మోడీతో మంచి స్నేహం ఉందని.. ఆయన గొప్ప ప్రధానమంత్రి అని ట్రంప్ అన్నారు. ఇద్దరం ఎల్లప్పుడూ స్నేహితులమేనని చెప్పుకొచ్చారు. కాకపోతే ఈ ప్రత్యేక సమయంలో మోడీ చేస్తున్నదే తనకు నచ్చడం లేదన్నారు. కానీ ఇరు దేశాల మధ్య ఉన్న బంధం మాత్రం చాలా ప్రత్యేకమైందని వెల్లడించారు. చింతించాల్సిన పని లేదని.. అప్పుడప్పుడు విభేదాలు సహజంగా జరుగుతుంటాయని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Ajit Pawar: అజిత్ పవార్ తో వివాదం.. ఐపీఎస్ సర్టిఫికెట్లపై దర్యాప్తుకు డిమాండ్.. ఎన్సీపీ నేత యూపీఎస్సీకి లేఖ
ట్రంప్ చేసిన వ్యాఖ్యలను స్పందిస్తూ మోడీ కీలక పోస్ట్ చేశారు. తమ సంబంధాలపై ట్రంప్ భావాలను అభినందిస్తున్నట్లు తెలిపారు. భారత్-అమెరికా బంధం చాలా సానుకూలమైందన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉంటామని మోడీ పేర్కొన్నారు.
చైనా కారణంగా భారత్, రష్యాను కోల్పోయామని.. ఆ రెండు దేశాలు చైనా చీకటిలోకి వెళ్లిపోయాయని ఇటీవల చైనాలో మోడీ-పుతిన్-జిన్‌పింగ్ కలిసి ఉన్న ఫొటోను తన సొంత సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు. దీనిపై ఓవల్ కార్యాలయంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. మోడీ మంచి స్నేహితుడని.. రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.
భారత్‌పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించినట్లు బాంబ్ పేల్చారు. దీంతో భారత్‌పై అత్యధికంగా 50 శాతం సుంకం విధించినట్లైంది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
Deeply appreciate and fully reciprocate President Trump's sentiments and positive assessment of our ties.
India and the US have a very positive and forward-looking Comprehensive and Global Strategic Partnership.@realDonaldTrump @POTUS https://t.co/4hLo9wBpeF
— Narendra Modi (@narendramodi) September 6, 2025
తాజావార్తలు
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!