ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని హమాస్‌తో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ తెలిపారు. శుక్రవారం ఓవర్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడుతూ.. గాజాలో బందీలుగా ఉన్న వారిని విడుదల చేయాలని హమాస్‌తో చాలా లోతైన చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బందీలను విడుదల చేయాలని హమాస్‌కు విజ్ఞప్తి చేశారు. లేదంటే ఫలితం వేరేగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. బందీలను చెరలో ఉంచుకోవడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: US Tariffs: 2 నెలల్లో భారత్ క్షమాపణలు చెబుతుంది.. అమెరికా అధికారి ప్రేలాపనలు
తక్షణమే విడుదల చేయాలని హమాస్‌ను కోరామన్నారు. బందీలను విడుదల చేస్తే హమాస్‌కే మంచి జరుగుతుందని.. ఒకేసారి అందరినీ విడుదల చేయకపోతే మాత్రం పరిస్థితి మాత్రం కఠినంగా ఉంటుందని.. చాలా భయంకరంగా ఉండొచ్చని హెచ్చరించారు. ఇక హమాస్ కూడా కొన్ని విషయాలను అడుగుతుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Honeymoon Murder Case: సోనమ్‌కు షాక్.. ఎన్ని పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారంటే..!
అక్టోబర్ 7, 2023న హమాస్ హఠాత్తుగా ఇజ్రాయెల్‌పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయారు. పాలస్తీనియన్ ఉగ్రవాదులు 250 మంది బందీలను గాజాలోకి తీసుకెళ్లారు. అనంతరం ఇజ్రాయెల్.. హమాస్ లక్ష్యంగా గాజాపై దాడులకు తెగబడింది. ఆ నాటి నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు అనేక మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. ఆ మధ్య కాలంలో కొంత మంది బందీలను విడుదల చేశారు. ఇంకొందరు హమాస్ చెరలోనే ఉన్నారు. అయితే తాత్కాలిక కాల్పుల విరమణ కోసం కొంతమంది బందీలను విడుదల చేస్తామని హమాస్ చెబుతుండగా.. ట్రంప్ పదేపదే బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని కోరుతున్నారని హమాస్ అంటోంది. ఇజ్రాయెల్ సైన్యం వైదొలిగితేనే బందీలను విడుదల చేస్తామంటూ హమాస్ పేర్కొంటోంది. ఏం జరుగుతుందో చూడాలి.