ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21వ రోజుకు చేరింది.. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఎండాడ MVV సిటీలో రాత్రి బస చేసిన కేంద్రం నుంచి బయల్దేరనున్న సీఎం జగన్.. మధురవాడ, మీదుగా ఆనందపురం చేరుకుంటారు.. ఇక, స్థానిక చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు..
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో విలేజ్/వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవహారం కాకరేపుతోంది.. అయితే, మూకుమ్మడిగా వాలంటీర్లు రాజీనామా చేయడం చర్చగా మారింది.. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఏపీలో వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టులో బోడే రామచంద్ర యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు.. బీసీవై పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బోడే రామచంద్ర యాదవ్.. వాలంటీర్ల రాజీనామాలు ఆమోదిస్తే వీరంతా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తారని, ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు పక్కదారి పడతాయని తన పిటిషన్ ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు
ఏపీ టెన్త్ 2023-24 ఫలితాలు విడుదలయ్యాయి.. ఈ సారి కూడా బాలికలే పైచేయి సాధించారు.. ఎస్ఎస్సీ ఫలితాలను విడుదల చేసిన ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్ధి వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు అన్నారు. ఇక, ఈ ఏడాది 6,16,615 మంది పరీక్షలు రాశారు.. 16 లక్షల్లో 86.69 శాతం విద్యార్థులు.. అంటే 5,34,578 మంది ఉత్తీర్ణులు అయినట్టు వెల్లడించారు.. ఇక, వీరిలో బాలురు 83.21 శాతం, బాలికలు 89.17 శాతం పాస్ అయ్యారని తెలిపారు.. 17…
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ సీటుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.. ఆ సీటు మార్పుకు బీజేపీ అధిష్టానం ఒప్పుకోకపోవడంతో.. ఆ పార్టీ అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయబోతున్నారు.. మొదట భారతీయ జనతా పార్టీలో చేరి.. పోటీ చేయాల్సిందిగా నల్లమిల్లిని కోరారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. కానీ, టీడీపీని వీడేందుకు ఆయన ఒప్పుకోలేదు.. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నచ్చజెప్పడంతో.. రామకృష్ణారెడ్డి.. బీజేపీ నుంచి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.