AP Riots: ఏపీలో హింసాత్మక ఘటనలు.. పోలీసు రియాక్షన్ స్టార్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Riots: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత మొదలైన గొడవల టెన్షన్ కొనసాగుతూనే ఉంది. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండడంతో పోలీసులు అలర్ట్‌గా ఉన్నారు. ఇక నుంచి ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో పోలీస్ పికెట్ కొనసాగుతుండగా.. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్‌రెడ్డితో పాటు.. కూటమి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. భద్రత మరింత పెంచారు. దేవగుడిలో ఆదినారాయణ రెడ్డి సోదరులు ఇళ్ల వద్ద పోలీసుల మోహరించారు. కొంత వారిని అనుమతించడం లేదు. ఆక్టోపస్ ఎస్పీ ఆధ్వర్యంలో భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సుధీర్ రెడ్డిని మరో ప్రాంతానికి తరలించారు.
Read Also: CM Revanth Reddy: రాష్ట్ర ఆదాయం పెంపుపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జెడ్పీటీసీ భర్త భాను కుమార్‌రెడ్డి, సర్పంచ్ గణపతి రెడ్డిలతో పాటు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. అటు.. చంద్రగిరిలో ఉద్రిక్త పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. రెండు పార్టీల అభ్యర్థులను గృహ నిర్బంధంలోనే ఉంచారు పోలీసులు. మరో వైపు గన్‌మెన్ ధరణి ఫైరింగ్‌లో కాలికి బుల్లెట్ గాయమైన సుధాకర్‌రెడ్డిని చికిత్స కోసం చెన్నైకి తరలించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి హింసలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వైసీపీ, టీడీపీలకు చెందిన 91 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఉరవకొండ కోర్టులో హాజరు పర్చారు. వారిలో టీడీపీకి చెందిన వారు 54 మంది, వైసీపీకి చెందిన వారు 37 మంది ఉన్నారు. అటు.. కోనసీమ జిల్లాల్లో కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. వల్లూరు గ్రామ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యూదుతో కేసు నమోదు చేశారు అంగర పోలీసులు. జనసేన ఇంఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ భార్య ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసును నమోదు చేశారు. తోట త్రిమూర్తులుతోపాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు. మొత్తానికి గురువారం చిన్న చిన్న ఘటనలు మినహా పరిస్థితి అంతా అదుపులో ఉందని తెలిపారు పోలీసులు. నిఘాను కట్టుదిట్టం చేశారు.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?