మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కీలకమైన సమయాల్లో తన యాత్రకు బ్రేక్ ఇస్తూ ఇస్తున్నారు.. ఇక, ఇవాళ "మేమంతా సిద్ధం" బస్సు యాత్ర కు బ్రేక్ పడింది.. ఉత్తరాంధ్రలో ఎన్నికల వ్యూహంపై కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు జగన్.. సీనియర్ నేతలతో అంతర్గత సమావేశం కానున్నారట.
పున్నమి వెలుగుల్లో ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణానికి సర్వం సిద్ధం అవుతోంది.. ఈ రోజు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు పౌర్ణమి రోజున పండు వెన్నెల్లో రాములోరి కల్యాణోత్సవం జరగనుంది.. ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో నవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతుండగా.. అందులో భాగంగా ఛైత్ర పౌర్ణమి రోజు రాత్రి స్వామివారికి కళ్యాణం జరిపించడం ఒంటిమిట్ట ఆనవాయితీగా వస్తుంది.. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే కళ్యాణం కోసం ఒంటిమిట్ట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
ఐపీఎల్ మ్యాచులంటేనే చివరిబంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ. అనూహ్య విజయాలు, ఓటముల్లో మాత్రం బెట్టింగ్ల కోసం ఫిక్సింగ్ చేశారనే టాక్ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి సహజంగానే వినిపిస్తుంది. ఈ సీజన్లోనూ ఇలాంటి మ్యాచులు ఎక్కువే ఉన్నాయి. దీంతో కొన్ని మ్యాచుల్లో ప్లేయర్లు ఫిక్సింగ్కి పాల్పడి ఉంటారన్న అనుమానాలున్నాయి. ముంబై, జైపూర్ స్టేడియాల్లో బుకీలను గుర్తించి పోలీసులకు అప్పగించారన్న సమాచారంతో ఫిక్సింగ్ జరిగిందనే అనుమానాలు బలం చేకూరుతోంది.
ఐపీఎల్ 2024 సీజన్లో వరుసగా భారీ స్కోర్లు చేస్తూ వస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి పరుగుల వరద పారించింది.. ఐపీఎల్ 2024లో 35వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతోన్న సన్రైజర్స్ హైదరాబాద్.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగింది.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మళ్లీ రికార్డులు సృష్టించింది.. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ట నష్టానికి 266 పరుగులు చేసిన హైదరాబాద్ జట్టు.. ఢిల్లీ ముందు.. 267 భారీ లక్ష్యాన్ని పెట్టింది..