విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విశాఖపట్నం జిల్లా ఎండాడ నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు. విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యను సీఎంకు నివేదించారు కార్మిక సంఘాల నాయకులు. ఇక, ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడిన సీఎం.. రాష్ట్ర ప్రభుత్వం, వైయస్సార్పీపీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అండగా నిలుస్తుందని హామీ…
పెళ్లికూతురు ఇంట్లో భోజనాలు సరిగా పెట్టలేదని.. మాంసం వడ్డించలేదని.. మర్యాద సరిగా చేయలేదని గొడవలు జరుగుతుంటాయి. కానీ, టీ పోయలేదని ఇరువర్గాలు గొడవ పడ్డ ఘటన ఖమ్మంలో జరిగింది. ఖమ్మం ప్రకాష్ నగర్ కు చెందిన యువతికి చెరువుబజార్ కు చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. దీంతో పెళ్లి కూతురి ఇంటి వద్ద పూజలకు పెళ్లి కొడుకు తరపు బంధువులు వెళ్లారు.
టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటిపోరుపై దృష్టి పెట్టిన వైసీపీ అధిష్టానం.. రంగంలోకి దిగి దువ్వాడ వాణితో మంతనాలు జరిపిందట.. దువ్వాడ వాణిని బుజ్జగించినట్టు టాక్ వినిపిస్తోంది.. ఈ నేపథ్యంలోనే దువ్వాడ వాణి వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది.. ఇక, తన భార్య పోటీకి దూరంగా ఉంటానని చెప్పడంతో.. దువ్వాడ శ్రీనివాస్ కు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది.
శ్రీవారి వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. ఎందుకంటే.. టీటీడీ వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఇవాళ ఉదయం 10 గంటలకు జులై నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నారు.. ఇక, ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల అవుతాయని.. మరోవైపు మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేస్తారు..