ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో ఒక కొత్త బెంచ్‌మార్క్‌ని నెలకొల్పింది సన్ రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ మ్యాచ్ పవర్‌ప్లే దశలో అత్యధిక స్కోర్‌ను సాధించింది ఎస్ఆర్హెచ్.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ ఈ కొత్త రికార్డుకు వేదికగా మారింది.. రికార్డు స్థాయి ప్రదర్శనతో SRH మొదటి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 125 పరుగులు చేసింది
నా తల్లిదండ్రులు, భార్య, పిల్లల మీద ఓట్టేసి చెబుతున్న.. నేను రంజిత్ రెడ్డి అన్న గెలుపు కోసం కృషి చేస్తాను అని స్పష్టం చేశారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.
మేమంతా మౌనంగా ఉన్నాం.. అనవసరంగా వివాదాలు సృష్టించొద్దు.. మేం దణ్ణం పెట్టి చెబుతున్నాం.. హత్యలు, దాడులకు దూరంగా ఉండాలి అని విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. మీ దాడులకు మా రియక్షన్ వేరేలా ఉంటే టీడీపీ నేతలు తట్టుకోలేరు అని హెచ్చరించారు.
జగన్ ఒక బచ్చా అని కూడా చంద్రబాబు అంటున్నాడు.. చంద్రబాబు మాటలు చూస్తే కృష్ణుడిని బచ్చా అనుకున్న కంశుడు గుర్తుకు వస్తున్నాడు అని దుయ్యబట్టారు సీఎం జగన్.. హనుమంతున్ని బచ్చా అనుకున్న రావణుడికి కూడా ఏమైందో చూశాం... పేదలకు మంచి చేసి వుంటే బచ్చాను చూసి భయపడి 10 మందిని ఎందుకు పోగేసుకుంటున్నావు? అంటూ సెటైర్లు వేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ ప్రకటించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. ఇప్పుడు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం, ఈరోజు ఉదయం తన కేడర్ తో సమావేశమయ్యారు ప్రకాష్ గౌడ్.. అయితే, ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ కు సూచించారు పలువురు నేతలు.. దీంతో, తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీలో చేరే విషయాన్ని విరమించుకొని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెనుకడుగు వేశారు.. కార్యకర్తల సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
బనగానపల్లె కోటపై టీడీపీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్‌రెడ్డి.. నంద్యాల జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకోగా.. బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి.. గెలుపే దిశగా మరో ముందడుగు వేశారు.. ఈ రోజు కుటుంబసభ్యుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని చిత్తుగా ఓడిస్తానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.