YSRCP: రాజ్‌భవన్‌కు వైసీపీ నేతల బృందం.. పోలింగ్ తర్వాత హింసపై ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం.. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది.. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.. వైసీపీ నేతలు, మంత్రులు.. ఈ బృందంలో మంత్రి బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, మాజీ మంత్రి పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ , కావటి మనోహర్ నాయుడు తదితరులున్నారు.. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న అల్లర్లు, దాడులు వెనుక ఉన్న బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గవర్నర్ ను కోరారు వైసీపీ నేతలు.
Read Also: RAJASTHAN: మూడేళ్ల పాపను కారులో మరిచి వెళ్లిన తల్లిదండ్రులు.. చివరకు విషాదం మిగిలింది..
Also Read
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన రేపుతోంది.. ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశాం.. అబర్వర్ దీపక్ మిశ్రా పక్ష పతంగా వ్యవహరిస్తున్నారు.. టీడీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారు.. అబర్వర్ గా ఉన్న దీపక్ మిశ్రా పై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.. ఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ తెచ్చుకుని దీపక్ మిశ్రాను మార్చాలని గవర్నర్‌ను కోరినట్టు వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
Read Also: Police Fine: ఆ దెబ్బకు ఆడీ కారులో హెల్మెట్ పెట్టుకుని ప్రయాణిస్తున్న వ్యక్తి.. మ్యాటరేంటంటే..
ఇక, పల్నాడు ఎస్పీ, ఐజీ త్రిపాఠి వంటి కొందరు అధికారులు ఎన్నికల వేల పచ్చ చొక్కాలు వేసుకున్నారు అంటూ విమర్శలు గుప్పించారు మంత్రి మేరుగ నాగార్జున.. రాయలసీమ, పల్నాడులో పోలీసులను మార్చాలని కోరాం.. కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో దీపక్ మిశ్రాను మార్చి దేశంలో ఏ అధికారి అయినా పర్లేదు అని గవర్నర్ ను కోరాం అన్నారు. మరోవైపు.. ఎంపీ మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ.. దీపక్ మిశ్రా వల్లే ఈ విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. పోలీసుల పక్షపాత ధోరణి వల్లే ఈ హింస జరుగుతోందన్నారు. దీపక్ మిశ్రా కనుసన్నల్లో పోలీసులు ఉన్న చోట ఈ హింస జరుగుతుందన్న ఆయన.. ప్రశాంతంగా ఉన్న ఏపీలో ఇలాంటి పరిస్థితులు రావటానికి కారణం దీపక్ మిశ్రా.. అతడిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామని పేర్కొన్నారు ఎంపీ మోపిదేవి వెంకట రమణ.
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు