చిరంజీవిని ఉద్దేశించి నేను ఏమి అనలేదని స్పష్టం చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. అయితే, చిరంజీవి మద్దతు ఇవ్వడం మంచిదే.. కానీ, ఇంకా ఎవ్వరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదు అని మాత్రమే చెప్పానన్నారు. చిరంజీవిని నేను విమర్శించా అని చెప్పడం ద్వారా కొంత మందిని అయిన దగ్గర చేసుకోవచ్చు అని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు అంటూ దుయ్యబట్టారు.
వాలంటీర్ల రాజీనామాతో మాకు సంబంధం లేదని హైకోర్టుకు తెలిపింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం.. ఇప్పటి వరకు 66 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్టు కోర్టుకు తెలిపిన ఈసీ.. 900 మందికి పైగా వాలంటీర్ల మీద చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది.. ప్రభుత్వంలో ఉంటే వాలంటీర్ల మీద చర్యలు తీసుకుంటామని రాజీనామా చేసిన వారి విషయంలో మేమే సర్క్యులర్ ఎలా ఇవ్వగలమని కోర్టుకు చెప్పింది.
జగన్ మార్క్.. ప్రతి ఇంట్లో.. ప్రతీ గ్రామంలో కనిపిస్తుంది.. జగన్ కి పేదలపై ఉన్నంత ప్రేమ.. దేశంలో ఏ నాయకుడికి లేదు, ఉండదు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. జగన్ చేయలేని స్కీంలు.. చంద్రబాబు ఆయన బాబు కూడా చేయలేడని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు.. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్యం 13 లక్షలు కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి.. ఒక్కోక్కరి తలపై 2 లక్షల రూపాయల అప్పు ఉంటుందని సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
ఆంధ్రప్రదేశ్లో మార్చి, ఏప్రిల్ నెలల్లో గతంలో కంటే మద్యం అమ్మకాలు బాగా పెరిగాయి.. ముఖ్యంగా మార్చి నెలలోనే మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి.. ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు మార్చి మొదటి అర్ధ భాగంలోనే చాలా జిల్లాల్లో మద్యం సేల్స్ విపరీతంగా జరిగాయి.. అంటే చాలా చోట్ల మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి దాచారు అనడానికి ఈ అమ్మకాలు నిదర్శనంగా చెప్పచ్చు.. అదే ఏప్రిల్ నెల అమ్మకాలు చూస్తే కట్టడి చేసేందుకు చర్యలు పెంచడం, ఎక్కడికక్కడ సీజ్ లు, సస్పెన్షన్ లు, షోకాజ్ నోటీసులు…
నెల్లూరు లోక్ సభ స్థానానికి నామినేషన్ వేయడం నా జీవితంలో మర్చిపోలేని రోజుగా అభివర్ణించారు నెల్లూరు లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ సాయిరెడ్డి.. ఈ రోజు నెల్లూరు లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పుట్టి పెరిగిన నెల్లూరు లోక్ సభకు పోటీ చేయడం జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు.