Nara Lokesh Kavali Visit: కావలి రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. నేడు మంత్రి నారా లోకేష్ కావలి నియోజకవర్గంలోని దగదర్తికి పర్యటనకు రానున్నారు. ఇటీవల మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అయితే, ఈ పర్యటన వెనుక రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కావలి టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు లోకేష్ పుల్‌స్టాప్ పెట్టబోతున్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. గతంలో […]
Ramachandrapuram Bandh: నేడు రామచంద్రాపురం బంద్‌కు పిలుపు ఇచ్చింది జేఏసీ.. రామచంద్రాపురం నియోజకవర్గాన్ని ప్రస్తుతం ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వద్దు.. మా ప్రాంతాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నేడు రామచంద్రాపురం బంద్‌కు పిలుపునిచ్చింది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు రాజకీయ నాయకులు ప్రజల డిమాండ్‌ను పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జేఏసీ నాయకులు మండిపడుతున్నారు.. రామచంద్రాపురం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం నుండి […]
* నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ-20.. మధ్యా్హ్నం 1.45 గంటలకు కరార వేదికగా టీ-20 మ్యాచ్ * బీహార్‌లో తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. తొలివిడతలో 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకోనున్న 3.75 కోట్ల మంది ఓటర్లు.. బరిలో 1,314 మంది అభ్యర్థులు.. నవంబర్ 14న ఫలితాల ప్రకటన * తొలివిడతలో బీహార్‌లో 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు.. ఉదయం 7 గంటల […]
NTV Daily Astrology as on 6th November 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
Botsa Satyanarayana: అసెంబ్లీ జరుగుతున్న విధానం, బాలకృష్ణ స్పీచ్ చూసిన తర్వాత ఎవరైనా సభకు వెళ్తారా? అని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. అసెంబ్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల తర్వాత ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఇప్పటికీ చెప్పలేదన్నారు.. అటువంటి సభకు వెళ్లి మాట్లాడటం కంటే.. ప్రతిపక్షంగా జనం దగ్గరకు వెళ్లి చెప్పడమే కరెక్ట్… మేం అదే చేస్తున్నాం అన్నారు.. ఇక, సభకు రాని ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటామని చెబుతున్న […]
Botsa Satyanarayana: మొంథా తుఫాన్ సమయంలో పంట నష్టంపై ప్రభుత్వం దగ్గర సమగ్రమైన లెక్క లే లేవు… ఉంటే బహిర్గతం చేయండి అని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. 24 జిల్లాలలో రైతులు తుఫాన్ వల్ల నష్టపోతే ముఖ్యమంత్రి, మంత్రులు మాటలకే పరిమితం అయ్యారని విమర్శించారు. ఈ 18 నెలల కాలంలో వర్షాలు, కరువు కారణంగా నష్టపోయిన ఎన్ని మండలాలకు ఎంత పరిహారం చెల్లించారు లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.. పంట నష్టంపై పూర్తి […]
Minister kollu Ravindra: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనపై సెటైర్లు వేశారు మంత్రి కొల్లు రవీంద్ర.. వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అని పేర్కొన్నారు.. జగన్ పర్యటనలో ఎక్కడా కూడా రైతులు కనిపించలేదన్న ఆయన.. తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో రైతులు లేక పక్క గ్రామాల నుండి రైతులను తెప్పించుకుని పబ్లిసిటీ స్టంట్లు చేశారని దుయ్యబట్టారు.. పొలం గట్ల మీద నడిచి ఫొటోలకు స్టిల్స్ ఇచ్చాడు.. తుఫాన్ […]
MLA Adinarayana Reddy: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. ప్రస్తుతం జగన్‌కు రాష్ట్ర పురోగతి అనేది అర్ధం కాదు. ఆయనకు పదవి కావాలి అని విమర్శించారు.. చంద్రబాబు అరెస్టు కూడా ఉద్దేశపూర్వకంగా చేశారని తెలిపారు.. ఇప్పుడు జగన్ కి ఏదీ చెల్లడం లేదు… జగన్ కి పదవి కావాలి.. ధర్మ విస్మృతికి అలవాటు పడ్డాడు.. జలజీవన్ మిషన్, అమృత్ పధకాలు మనకు వస్తున్నాయి పవర్ […]
Minister Nimmala Ramanayudu: కళలకు, కళాకారులకు పాలకొల్లు పుట్టినిల్లు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాలకొల్లుకు విశిష్ట స్థానం ఉందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిలిం ఇన్స్టిట్యూట్ యొక్క ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, పాలకొల్లు కళలకూ, కళాకారులకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమలో పాలకొల్లుకు ప్రత్యేక స్థానం ఉందని, రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌లో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం […]