ఏపీలో రెండో రోజు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఏసీబీ దాడులు.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.. తొలిరోజు పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. రెండో రోజు కూడా మరికొన్ని చోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి.. అవినీతి, అక్రమ లావాదేవీలపై సమాచారం అందిన నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నం, పల్నాడు నరసరావుపేట, తిరుపతి సహా మొత్తం 12 సబ్ […]
SRM University: ఎస్.ఆర్.ఎం. యూనివర్సిటీలో విద్యార్థులకు నాణ్యతలేని భోజనం పెట్టడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వం కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. మంగళగిరి మండలం నీరుకొండలో ఎస్.ఆర్.ఎం. యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఫుడ్ పాయిజన్ తో కొంతమంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో నిన్నరాత్రి విద్యార్దులు యూనివర్సీటీలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. లక్షల రూపాయల […]
Minister Atchannaidu: పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నదని లేఖలో పేర్కొన్నారు. రైతులు ప్రస్తుతం కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరలకు పత్తిని విక్రయించాల్సి వస్తోందని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2025–26 ఖరీఫ్ సీజన్లో 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరుగుతుందని, దాదాపు […]
Gautam Reddy Car Fire: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతమ్ రెడ్డి కారుపై గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడలోని గౌతమ్ రెడ్డి నివాసం సమీపంలో పార్క్ చేసి ఉంచిన కొత్త కారుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తి.. ఆ తర్వాత అక్కడి నుంచి పరిపోయాడు.. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ, ఓ బ్యాగ్తో అక్కడికి […]
Perni Nani: మీకు పాలన చేతకాకపోతే దిగిపోయి వైఎస్ జగన్కు అప్పగించండి.. పాలన ఎలా చేయాలో చేసి చూపిస్తారు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని.. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభమై ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నేతలు.. కేక్ కట్ చేశారు.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ […]
Mandava Janakiramayya Passes Away: విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ మండవ జానకిరామయ్య కన్నుమూశారు.. ఆయన వయస్సు 93 సంవత్సరాలు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జానకిరామయ్య, గన్నవరం శివారులోని రుషి వాటిక వృద్ధాశ్రమంలో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘకాలం పాటు విజయ డెయిరీ చైర్మన్గా అంటే ఏకంగా 27 సంవత్సరాలు సేవలందించిన ఆయన, రాష్ట్రంలోని పాడి రైతుల సంక్షేమం కోసం నిరవధికంగా కృషి చేశారు. తన స్వగ్రామం మొవ్వలో విద్యా అభివృద్ధికి […]
Electricity Bills: విద్యుత్ ఛార్జీల విషయంలో శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. విద్యుత్ వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగించేలా ఈ నెల నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.. అయితే, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బిల్లుల్లో ఎఫ్పీపీపీ ఛార్జీలు 40 పైసలు అధికంగా వసూలు చేశాయని గుర్తుచేసిన ఆయన.. దీంతో, పేదలను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు.. అయితే, కూటమి సర్కార్ విద్యుత్ బిల్లులు తగ్గించేలా చర్యలు తీసుకుంటుంది.. […]
ACB Raids: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.. తొలిరోజు పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. రెండో రోజు కూడా మరికొన్ని చోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి.. అవినీతి, అక్రమ లావాదేవీలపై సమాచారం అందిన నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నం, పల్నాడు నరసరావుపేట, తిరుపతి సహా మొత్తం 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం […]
కోనసీమలో వద్దు కాకినాడ ముద్దు.. నేడు బంద్కు జేఏసీ పిలుపు నేడు రామచంద్రాపురం బంద్కు పిలుపు ఇచ్చింది జేఏసీ.. రామచంద్రాపురం నియోజకవర్గాన్ని ప్రస్తుతం ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వద్దు.. మా ప్రాంతాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నేడు రామచంద్రాపురం బంద్కు పిలుపునిచ్చింది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు రాజకీయ నాయకులు ప్రజల డిమాండ్ను పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జేఏసీ నాయకులు మండిపడుతున్నారు.. రామచంద్రాపురం డాక్టర్ బీఆర్ […]
Bus Catches Fire: తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వరుస ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. తాజాగా, ఆంధ్రప్రదేశ్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది.. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది.. చేవెళ్ల దగ్గర మరో ప్రమాదంలో 19 మంది మృతిచెందిన ఘటన.. ఇప్పటికీ అందరినీ కలచివేస్తుండగా.. ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి […]