SLBC Meeting: ఏ ఒక్కరూ ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదు..! సీఎం కీలక ఆదేశాలు
- సచివాలయంలో ముగిసిన 233, 234వ ఎస్ఎల్బీసీ సమావేశం..
- వివిధ రంగాలకు ఇచ్చే రుణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
- ఏ ఒక్కరూ ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదు..
- వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా..
- బ్యాంకుల వద్దకు వెళ్లి రుణాలు తీసుకునే పరిస్థితి రావాలన్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SLBC Meeting: : రాష్ట్రంలో ప్రజలు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి పూర్తిగా తొలగిపోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా ప్రజలు నేరుగా బ్యాంకులను ఆశ్రయించే పరిస్థితి రావాలని, అందుకు బ్యాంకర్లు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 233, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో వివిధ రంగాలకు బ్యాంకులు ఇస్తున్న రుణాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి బ్యాంకులు మరింత చొరవ చూపాలని సీఎం సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగానికి పెద్దపీట వేస్తున్నాయని, డిస్కంలు కూడా కౌంటర్ గ్యారెంటీ ఇస్తున్నందున బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో వెనకడుగు వేయకూడదని పేర్కొన్నారు.
Read Also: Anil Ravipudi: వరుసగా 9 హిట్లు.. 10వ సినిమాపై అనిల్ రావిపూడి సెన్సేషనల్ అప్‌డేట్!”
Also Read
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పెద్ద ఎత్తున రుణాలు అందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు… అప్పుడే అన్ని వర్గాల బడుగులు ఆర్థికంగా ఎదుగుతారని చెప్పారు. ప్రభుత్వంగా తమ వంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని, బ్యాంకుల నుంచి కూడా పూర్తి సహకారం కావాలని సూచించారు. రాజధాని అమరావతిని ఫైనాన్స్ సంస్థలకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని సీఎం తెలిపారు. ఇప్పటికే 15 బ్యాంకుల కార్యాలయాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశామని, నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా బ్యాంకులు సహకరించాలని కోరారు.
ఇక, డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసిన విధంగానే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లను (FPOs) కూడా బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. టిడ్కో ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఇళ్లకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, బ్యాంకులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డ్వాక్రా గ్రూపుల బ్యాంక్ ఖాతాలపై విధిస్తున్న 15 రకాల ఛార్జీలను తగ్గించాలని సీఎం సూచించారు. భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయ్యిందని, క్యూఆర్ కోడ్‌తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. ఇదే తరహాలో బ్యాంక్ ఖాతాల కోసం కూడా క్యూఆర్ కోడ్ విధానం అమలు చేసే అంశాన్ని బ్యాంకర్లు ఆలోచించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!