AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై.. విజయవాడ జిల్లా జైలులో 220 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్వల్ప ఊరట దక్కింది.. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో చికిత్స చేసుకునేందుకు చెవిరెడ్డికి అనుమతించింది ఏసీబీ కోర్టు.. ఆరోగ్య పరంగా తనకు మంతెన ఆశ్రమంలో చికిత్స చేసుకునేందుకు అనుమతించాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై న్యాయాధికారి భాస్కర్‌రావు విచారణ జరిపి 15 రోజుల పాటు ఆశ్రమంలో ఆయుర్వేద చికిత్స చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు ఆశ్రమంలో వైద్య సేవలు అందించేందుకు అనుమతించారు. గతంలో వెన్నునొప్పి బాధపడుతున్న ఆయనకు మంతెన ఆశ్రమంలో తీసుకున్న చికిత్స వల్ల కాస్త తగ్గిందని, ఇప్పుడు కూడా అదే బాధతో ఇబ్బందులు పడుతున్నందున కోర్టుకు ఆ విషయాన్ని తెలియ పరచడంతో అందుకు అనుమతించింది.