Woman Constable Jayasanthi: ట్రాఫిక్ క్లియర్ చేసి అడ్డంగా దొరికిపోయిన మహిళా కానిస్టేబుల్.. తీవ్ర వివాదం..!
- వివాదంగా మారిన రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి వ్యవహారం..
- గత ఏడాది జరిగిన డీఎస్సీలో తప్పుడు సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందిన కానిస్టేబుల్..
- కానిస్టేబుల్ గా ఉన్న భర్త తాతారావు సంపాదన దాచి..
- తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందినట్లు నిర్ధారణ..
- విచారణ చేసి డీఎస్సీ ఉద్యోగం రద్దు చేసిన విద్యాశాఖ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Constable Jayasanthi: రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది.. చంటి బిడ్డను ఎత్తుకుని.. ట్రాఫిక్ క్లియర్ చేసిన ఓ వీడియో బయటకు రావడంతో.. ఆమె వైరల్‌గా మారిపోయింది.. ఆమెకు మద్దతుగా ఎంతోమంది పోస్టులు పెట్టారు.. ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఆమెను అభినందించారు.. అంతేకాదు.. హోం మంత్రి అనిత.. ఆమెను ఇంటికి పిలిచి భోజనం పెట్టి మరి సన్మానించారు.. కానీ, ఇప్పుడు అసలు కథ బయటకు రావడంతో దుమారమే రేగుతోంది..
Read Also: Ratha Saptami 2026: రేపే రథ సప్తమి- ఈ విధంగా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి పక్కా!
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
అయితే, గత ఏడాది జరిగిన డీఎస్సీలో తప్పుడు సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందింది జయశాంతి.. కానిస్టేబుల్ గా ఉన్న భర్త తాతారావు సంపాదన దాచి తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్ పొందినట్లు నిర్ధారణ అయింది.. విచారణ చేసి డీఎస్సీ ఉద్యోగం రద్దు చేశారు విద్యాశాఖ అధికారులు.. ప్రభుత్వాన్ని మోసం చేసిందని చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి ఎస్పీకి రిఫర్ చేశారు కాకినాడ డీఈవో.. ఇక, నకిలీ ఐడీ కార్డుతో ఎస్సై గా చలామణి అవుతున్న కామేశ్వరరావు అనే హెడ్ కానిస్టేబుల్ కి సహకారం అందించారు జయశాంతి, ఇటీవల చంటి బిడ్డను ట్రాఫిక్ క్లియర్ చేసి వార్తలలో నిలిచారు.. అది కూడా ప్లాన్ ప్రకారం జరిగిందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి పల్నాడు ఎస్పీఎఫ్ కి జయశాంతి భర్త తాతారావు గతంలో బదిలీ అయ్యారు.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రైల్వే నుంచి లా అండ్ ఆర్డర్ కు జయశాంతిని బదిలీ చేశారు.. భార్యాభర్తలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చర్యలు తీసుకోవడం, డీఎస్సీలో తప్పుడు ధృవీకరణ పత్రంతో ఉద్యోగం సంపాదించడంతో విమర్శలు రావడంతోనే చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు హడావిడి చేసిందని విమర్శలు వస్తున్నాయి.. తన పరిధి కాకపోయినా చంటి బిడ్డను ఎత్తుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారని ఇంటికి ఆహ్వానించి కానిస్టేబుల్ జయశాంతి దంపతులను సన్మానించారు హోంమంత్రి అనిత.. ఇప్పుడు వివాదం బయటకు రావడంతో.. ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది..
తాజావార్తలు
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?