Police Raids: గుంటూరు జిల్లా తెనాలిలో ఓ రోజువారీ కూలీ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. కోటిన్నర రూపాయల విలువైన బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెనాలి మహేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న వృద్ధురాలు గురవమ్మ రోజువారీ కూలి.. రైస్ పుల్లింగ్ చేస్తున్నారంటూ ఎస్పీకి వచ్చిన సమాచారంతో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. పోలీసుల సోదాల్లో గురవమ్మ ఇంట్లో 800 గ్రాముల బంగారం, 13 కేజీల వెండి, 5 లక్షల 65 వేల నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.. బంగారం వెండి గురించి పోలీసులు గురవమ్మను విచారించగా.. విజయవాడ చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేసే తన అల్లుడు దాచి పెట్టాడని చెప్పింది. దీంతో పోలీసులు విజయవాడలో గురవమ్మ అల్లుడు పనిచేస్తున్న చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్లారు. అప్పటికే అల్లుడు పరారయ్యాడు. బంగారం వెండి గురవమ్మ అల్లుడిదా..? లేక ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్ కు బినామీగా ఉన్నాడా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.. మొత్తంగా రోజువారీ కూలీ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. ఆమె ఇంట్లో లభించిన బంగారం, వెండి, నగదును చూసి షాక్ తిన్నారు..
Read Also: Vishwambhara: మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి మరో బిగ్ ట్రీట్..