ఏపీలో సీనియర్ ఐఎఎస్ అధికారిగా ఉన్న ఇంతియాజ్ అహ్మద్‌కు 2024 ఎన్నికల ముందు ఉన్నట్టుండి ఖద్దరు మీద మోజు పెరిగింది. ఎన్నాళ్ళని వాళ్ళకి వీళ్ళకి సలాం కొడతాం.... అదేదో... మనమే కొట్టించుకుంటే పోలా... అంటూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. తాను చేస్తున్న అఖిల భారత సర్వీస్ ఉద్యోగానికి ఒక్కటంటే.. ఒక్కరోజులోనే రాజీనామా చేసేసి... కేవలం ఒక్క పూటలోనే ఓకే స్టాంప్ వేయించుకున్నారు.
రాజమండ్రి నగరంలోని దానవాయిపేటలో ఒక బడా బిర్యాని రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రస్తుత ఎమ్మెల్యే తో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులను సైతం వ్యాపారులు ఆహ్వానించారు. అయితే.. ఎమ్మెల్యే వచ్చిన సమయంలో నలుగురైదుగురు పోలీసులు రావడం, మళ్ళీ వారి కూడా వెళ్లిపోవడం సహజం. కానీ.. ఈ బిర్యానీ షాపు ప్రారంభం సందర్భంగా ఈ రోజు రూ.5 కే బిర్యాని అందిస్తున్నట్లు ఆఫర్ ప్రకటించారు. దీంతో భారీగా జనం బిర్యాని కోసం ఎగబడ్డారు. ఇంతవరకు బానే ఉన్నా.. వీళ్ళు సాగిస్తున్న ఐదు రూపాయల బిర్యానీ…
ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొందరు టీడీపీ నాయకుల పరిస్థితి న ఘర్ కా... న ఘాట్ కా అన్నట్టు తయారైందట. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగైనా పవర్లోకి తీసుకు రావాలంటూ... పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటూ... ఉన్న ఊళ్ళను, చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి వచ్చారట కొందరు. పార్టీ పవర్లోకి వచ్చి ఆరునెలలైనా... ఎలాంటి అవకాశాలు దక్కక అడకత్తెరలో ఉన్నట్టు ఫీలవుతున్నారట. జిల్లాకు చెందిన ఇద్దరు ఎన్నారైలు.... విదేశాల్లో ఉద్యోగాలను వదులుకొని ఇక్కడికి రాగా.... ఓ జిల్లా స్థాయి అధికారి వీఆర్ఎస్ తీసుకున్నారు.
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.. ఏపీ, తెలంగాణకు చెందిన 1,200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు శుభవార్త చెప్పింది సుప్రీంకోర్టు.. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల నియామక జీవోను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించగా.. వాటిపై స్టేటస్ కో విధించింది సుప్రీంకోర్టు..
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం..
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం సమీపంలో నల్లమల ఫారెస్ట్‌లో భక్తులు తప్పిపోవడం కలకలం సృష్టించింది.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నల్లమల అటవీప్రాంతంలో శ్రీశైలం సమీపంలోని ఇష్ట కామేశ్వరీ దేవి ఆలయానికి వెళ్తూ.. తప్పిపోయారు 15 మంది భక్తులు.. వీరిని పోలీసులు, అటవీశాఖ అధికారులు కలిసి సురక్షితంగా రక్షించి అటవీప్రాంతం నుండి బయటకు తీసుకొచ్చారు..
వైసీపీ కంచుకోటకు కూడా బీటలు పడుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. కడప కార్పొరేషన్ లో పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే వైసీపీకి గుడ్‌బై చెప్పగా.. మరికొందరు కూడా రెడీ ఉన్నారని తెలుస్తోంది.. కడప మున్సిపల్ కార్పొరేషన్ లోని కార్పొరేటర్లు మెల్లగా టీడీపీ గూటికి చేరుకుంటున్నారు.
సంచలనం సృష్టించిన పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు ముద్దాయిలకు బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఈ హత్య జరిగిన 18 ఏళ్లకు ముద్దాయిలకు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం..
మాకు రైతులకు.. ప్రజలకు సేవనే మాకు ముఖ్యం.. మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు అని స్పష్టం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆందోళనలు చేసిన రైతులపై కేసులు పెట్టారని గుర్తుచేశారు.. రైతులను రౌడీ షీటర్లుగా మార్చారని ఆరోపించిన ఆయన.. కలెక్టరేట్ వద్ద వైస్సార్సీపీ నేతలు ఆందోళనలు చేస్తే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు..