ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలే సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయి.. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వ సమర్థ పాలన వల్లే సాగునీటి సంఘాల ఎన్నికలన్నీ ఏకగ్రీమయ్యాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం రానున్న మూడేళ్లలో పూర్తి చేస్తామంటూ కీలక ప్రకటన చేశారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. ఇప్పటికే అనుమతి లభించిన 45 వేల కోట్ల రూపాయల నిర్మాణాలకి రేపు కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపి.. టెండర్లు పిలవబోతున్నామని తెలిపారు. అమరావతి మొత్తం ప్రాజెక్టు వ్యయం 62 వేల కోట్ల రూపాయలు అని వెల్లడించారు. రాజమండ్రిలో పర్యటనలో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. వచ్చే ఏడాది జులైలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా తీవ్ర అల్పపీడనంగా మారింది.. ఇది, ఆంధ్రప్రదేశ్‌కు ముప్పుగా మారుతోంది. తమిళనాడు తీరానికి చేరువగా వచ్చి దిశను మార్చుకుంటుందని.. ఆ తర్వాత ఏపీ తీరం వెంబడి బలమైన ఈదురు గాలులతో పయనిస్తుందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ వుంది.
గుంటూరు జిల్లా నకరికల్లు డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. క్రైం థ్రిల్లర్‌ను తలపించిన ఈ కేసును సోదరి ప్రధాన నిందితురాలిగా తేల్చేశారు. తండ్రి సంపాదించిన ఆస్తి కోసం...అన్నదమ్ముళ్లను సొదరే చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన తండ్రికి 70 లక్షలకుపైగా ఆస్తి ఉంది. ఈ ఆస్తి వ్యవహారంలో అన్నదమ్ముళ్లు, చెల్లెలు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఆస్తి పంపకాల విషయంలో వాటాలు కుదరకపోవడంతో...చెల్లెలు కృష్ణవేణిని చంపేయాలని గోపికృష్ణ, రామకృష్ణ ప్లాన్ వేశారు.
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. అయితే ఇక్కడే బీఆర్ఎస్ కాస్త గందరగోళంలో ఉందన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. లగచర్ల భూ సేకరణ వివాదం నెల రోజుల నుంచి రాజకీయంగా నలుగుతోంది. ఈ ఎపిసోడ్లో ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్‌లో పడేయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది గులాబీ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా సిటీ ఏర్పాటు ప్రయత్నం చేసింది ప్రభుత్వం.
గ్రంధి శ్రీనివాస్.. భీమవరం మాజీ ఎమ్మెల్యే, కాపుసామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో ఒకసారి, జగన్ హయాంలో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. మేటర్ ఏదైనాసరే...సూటిగా సుత్తిలేకుండా మాట్లాడే గ్రంధి 2019లో పవన్ కళ్యాన్‌ను ఓడించి తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు. దాంతో వైసీపీలో గ్రంధి పొలిటికల్ కెరీర్‌కు ఇక తిరుగే ఉండదనుకున్నారు అప్పట్లో. సీన్ కట్ చేస్తే... 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి దూరం జరిగిన గ్రంధి శ్రీనివాస్ ఉన్నట్టుండి వైసికి గుడ్‌బై కొట్టేశారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ విషయంలో ప్రస్తుత మంత్రి పార్ధసారధి అడ్డంగా బుక్కయ్యారా? అంటే... అవుననే అంటున్నారట ఏపీ పొలిటికల్ పరిశీలకులు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంలో రెండు రోజుల క్రితం సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. అదే ప్రోగ్రామ్‌కు మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అటెండ్ అయ్యారు. ఇక విగ్రహావిష్కరణకు వెళ్ళే ముందు ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది.
మొదటి పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతి మార్చేందుకు సిద్ధం అవుతుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ).. దీనిపై ప్రతిపాదనలతో ముందుకొచ్చింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. గుజరాత్ లోని గిఫ్ట్ సిటీ తరహాలో పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతిని చేస్తామంటోంది ఐవోసీ.. ఇక, దీనికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.. కావాల్సిన సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు..