2025 జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజులపాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. పది రోజులపాటు టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించునుంది.
సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వానీ కేసులో విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. జత్వానీ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీ.. అయితే, విచారణలో కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తి.. ఇప్పటి వరకు ఈ కేసులో A2గా ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజ నేయులను ఎందుకు అరెస్ట్ చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు..
రాబోయే తరానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా క్రీడా పాలసీ తయారు చేశామన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ఏపీ క్రీడా యాప్ లాంచ్ చేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. శాప్ ఎండీ గిరీష్ కుమార్.. నూతన ప్రభుత్వం ద్వారా క్రీడలలో ప్రాధాన్యత పెరిగిందని.. దేశంలోనే అత్యుత్తమ క్రీడా విధానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టారని.. దేశంలో అధిక మొత్తంలో పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకం అందిస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ పర్యటించబోతున్నారు. ఉదయం 9.30 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న పవన్ కల్యాణ్.. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో సాలూరు చేరుకుంటారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్రపడింది.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్ నిర్ణయాలను వివరించారు..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. ముఖ్యంగా కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది విశాఖ వాతావరణ కేంద్రం.. నైరుతి బంగాళాఖాతం దాన్ని అనుకోని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని.. రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తోందని.. దీని ప్రభావంతో నెల్లూరు నుంచి విజయనగరం జిల్లా వరకు కోస్తా అంతటా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు ఉంటాయి.. కేసులుకూడా పెడతారు, జైళ్లలో కూడా పెడతారన్న జగన్.. ప్రతి కష్టానికి ఫలితం ఉంటుంది, చీకటి తర్వాత వెలుగు కూడా వస్తుంది.. ఏ కష్టం ఎవరికి ఎప్పుడు వచ్చినా.. నావైపు చూడండి.. 16 నెలలు నన్ను జైళ్లో పెట్టారు.. నా భార్య కనీసంగా 20 సార్లు బెయిల్ పిటిషన్ పెట్టి ఉంటుంది.. కింద కాంగ్రెస్, పైన కాంగ్రెస్.. ఇన్ని కష్టాలు పెట్టినా.. నేను ముఖ్యమంత్రిని కాలేదా? ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు.. ఎల్లకాలం కష్టాలు ఉండవు.. ఎవ్వరూ…
నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే.. యాక్షన్.. డైలాగ్స్.. ఏ సినిమాలోనైనా.. బాలయ్య మార్క్ డైలాడ్స్ ఉండాల్సిందే.. ఇప్పుడు బాలయ్య డైలాగ్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, బాలయ్య సోదరి నారా భువనేశ్వరి నోటా వచ్చింది.. కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతుండగా.. అందులో భాగంగా ఈ రోజు కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.. ఈ సందర్భంగా బాలయ్య సినిమా డైలాగ్ చెప్పారు భువనేశ్వరి
గుడివాడ అమర్నాథ్... ఏపీ మాజీమంత్రి. వైసీపీలో ఫైర్ బ్రాండ్ కమ్ జగన్ వీర విధేయత ముద్ర ఉన్న నాయకుడు. అప్పుడు మంత్రి పదవికైనా, ఇప్పుడు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష పదవికైనా... ఈ ఫార్ములానే వర్కౌట్ అయిందన్నది ఒక అభిప్రాయం. అదంతా డిఫరెంట్ స్టోరీ. కానీ... పార్టీ అధిష్టానం దగ్గర ఎంత పలుకుబడి ఉన్నా... ఏ పదవులు నిర్వహించినా... ఈ మాజీ మంత్రికి ఓ కేరాఫ్ అడ్రస్ లేకుండా పోయిందన్న అసంతృప్తి మాత్రం ఉందట ఆయనకు. గత ఎన్నికల సమయంలో పార్టీ చేసిన జంబ్లింగ్…