Minister Atchannaidu: మూడు రాజధానుల విషయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మంత్రి అచ్చెన్నాయుడు.. మూడు రాజధానుల విషయంలో వైఎస్ఆర్సీపీ యూ టర్న్ తీసుకుందన్న ఆయన.. యూ టర్న్ తీసుకుందంటేనే వాళ్ల తలాతోకలేని విధానాలకు నిదర్శనమని దుయ్యబట్టారు.. అయితే, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మేం వెళ్తున్నాం అన్నారు.. కానీ, వైఎస్ఆర్సీపీకి ఒక విధానమంటూ లేకపోవడం వల్లే ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు.. మరోవైపు, మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పార్టీ అభ్యర్థులను పెట్టని దౌర్భాగ్యం వైఎస్ఆర్సీపీది.. పీడీఎఫ్ ముసుగులో వైఎస్ఆర్సీపీ డ్రామా ఆడింది.. రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చిన పీడీఎఫ్ అభ్యర్దులు చిత్తు చిత్తుగా ఓడిపోతున్నారని తెలిపారు.
Read Also: BSNL: బిఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా.. అపరిమిత కాల్స్ ఏడాది పాటు వ్యాలిడిటీ!
ఇక, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎన్నికల్లో టీడీపీ ఎవరిని పోటీకి దింపలేదు.. పోటీ పెట్టకపోయినా ఎన్నికల్లో మాకు సహకరించిన రఘు వర్మతో పాటు గాదె శ్రీనివాసులుకు కూడా మొదటి, రెండు ప్రాధాన్యత ఓటు వేయమని సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో చెప్పారని గుర్తుచేశారు అచ్చెన్నాయుడు.. గాదె శ్రీనివాసులు టీడీపీ, జనసేన నేతల ఫొటోస్ వేసుకుని ఎన్నికల్లో పోటీ చేశారు.. రఘు వర్మ, గాదె శ్రీనివాస్ లు ఇద్దరిలో ఎవరు గెలిచినా మన వాళ్లే అని మేం ఘంటా పదంగా చెప్పాం.. అయితే, వాస్తవాలకు భిన్నంగా 9 నెలలకే టీచర్లు కూటమిని తిరస్కరించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి అచ్చెన్నాయుడు..