వైకుంఠ ఏకాదశికి సిద్ధమవుతోంది తిరుమల.. ఇక, వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు టీటీడీ ఈవో శ్యామలరావు.. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్లో విడుదల చేస్తాం.. 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2025 జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి.. ఈ మేరకు కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుందనే ప్రచారం సాగుతోంది.. పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి కొత్త భూమి విలువలు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ప్రసుత్తం ఉన్న దానిపై 10 శాతం నుంచి 15 శాతం వరకు భూమి విలువలు పెరిగే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. జనవరి ఫస్ట్ నుంచి ల్యాండ్ రేట్స్ రివిజన్ జరుగుతుందనేది…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. కాసేపటి క్రితం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయ్యారు.. పయ్యావుల కేశవ్ వెంట టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు కూడా ఉన్నారు.. రాష్ట్ర బడ్జెట్ ను ఇటీవలే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం విదితమే కాగా.. రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీకి వచ్చి నిర్మల సీతారామన్ ను కలిశారు పయ్యావుల కేశవ్..
హైకోర్టుకు చేరింది కాకినాడ పోర్టులోని ఎంవీ స్టెల్లా నౌక వ్యవహారం..తమ పారా బాయిల్డ్ రైస్ ను స్టెల్లా నౌకలో లోడు చేసేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.. అయితే, దీనిపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం.. బియ్యం రవాణా చేసేందుకు అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించింది హైకోర్టు.. నౌకలో బియ్యం లోడు చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటని ఈ సందర్భంగా ప్రశ్నించింది.
ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వీడడం లేదనే చెప్పాలి.. వరుసగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు.. వాటి ప్రభావంతో.. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. మొన్నటి వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురవగా.. మరో నాలుగు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి చేరుకుంటుందని ఐఎండీ అంచనా వేసింది.
పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశాలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.. సచివాలయంలో ఈ రోజు పశుసంవర్ధక, మత్స్య శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు..
ఏపీ నూతన పర్యాటక పాలసీ 2024-2029ను ఆవిష్కరించారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.. సీఐఐ, ఏపీ చాంబర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న పర్యాటక పెట్టుబడిదారుల సమావేశంలో.. ఈ కొత్త పాలసీని విడుదల చేశారు.. ఇక, నూతన పర్యాటక పాలసీ 2024-29పై పెట్టుబడిదారులతో చర్చించి ఆహ్వానించారు మంత్రి దుర్గేష్.. అంతేకాదు.. పెట్టుబడిదారుల నుంచి పలు ప్రతిపాదనలు స్వీకరించారు
మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆళ్ల నాని.. తెలుగుదేశం పార్టీలోకి రావడానికి లైన్ క్లియర్ అయ్యింది. అప్పుడు తాత్కాలికంగా వాయిదా పడినా.. ఇప్పుడు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. దీంతో.. రేపు ఉదయం 11 గంటలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు ఆళ్ల నాని.
మంగళగిరి ఎయిమ్స్‌కు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాల భూమి ఇస్తామని తెలిపారు.. దేశంలో ఏ AIIMS కు కూడా ఇలాంటి భూమి లేదు.. అమరావతి భారతదేశపు భవిష్యత్ సిటీ.. మంగళగిరి ఎయిమ్స్ భారతదేశంలోనే నంబర్ 1 అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు..