త్వరలోనే పార్టీ తరఫున యాప్ విడుదలచేస్తాం.. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా.. వెంటనే ఆ యాప్‌లో నమోదు చేయవచ్చు అన్నారు.. పలానా వ్యక్తి, పలానా అధికారి.. వారి కారణంగా అన్యాయంగా ఇబ్బంది పడ్డానని చెప్పొచ్చు.. ఆధారాలు కూడా ఆ యాప్‌లో పెట్టొచ్చు.. ఆ ఆధారాలన్నీ కూడా అప్లోడ్ చేయొచ్చు.. ఆ కంప్లైంట్ ఆటోమేటిగ్గా మన డిజిటల్ సర్వర్లోకి వచ్చేస్తోందన్నారు.. అయితే, ఆ ఫిర్యాదులపై మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కచ్చితంగా పరిశీలన చేస్తాం అని వెల్లడించారు.
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం సింగపూర్ పర్యటనపై హాట్ కామెంట్లు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీపీ పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి మాత్రమే సింగపూర్ పర్యటన అని ఆరోపించారు.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలేదు.. అంతా దోచుకుంటున్నారని మండిపడ్డారు..
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్రూవర్, ముందస్తు బెయిల్ పిటిషన్లు రెండు ఒకేసారి నిందితులు దాఖలు చేయటం చర్చగా మారింది. 2 పిటిషన్లు దాఖలు చేశారు నిందితులు కేసులో ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ3 సత్య ప్రసాద్.
ఆంధ్రప్రదేశ్‌ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన సింగపూర్ పర్యటనలో ఇందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పర్యటన 3వ రోజైన మంగళవారం ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లితో సమావేశమయ్యారు.
సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున థాంక్స్ చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుంది అంటూ ఆ దేశ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రి టాన్సీ లెంగ్ ప్రకటించడంపై ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆయన.. సోషల్ మీడియా వేదికగా.. వివిధ అభివృద్ది ప్రాజెక్టుల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధమన్న సింగపూర్ మంత్రి టాన్సీ లెంగ్ ప్రకటనకు ధన్యవాదాలు తెలిపారు.
నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT)లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఊరట దక్కింది.. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతించింది NCLT.. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
అదానీ గ్రూప్‌కు కేటాయింపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. అదానీ గ్రూప్ కు ఇచ్చిన పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ఆంధ్రా - ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో అదాని గ్రూప్‌నకు పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు ఇచ్చింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. అయితే, గిరిజనులకు దక్కాల్సిన ప్లాంట్లు అదానీ గ్రూప్ కు ఇవ్వడంతో వెనక్కు తీసుకుంది కూటమి సర్కార్..
సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు సింగపూర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రి.. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేస్తూ.. ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుందని తెలిపారు టాన్సీ లెంగ్.. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు.. భారత్ లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు సింగపూర్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని వెల్లడించారు.. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ , నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులపై సీఎం చంద్రబాబుతో…
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఉదయం 10.30 గంటలకు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యులతో భేటీకానున్నారు.. ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో చర్చించనున్న వైఎస్ జగన్..