Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వారి ఖాతాల్లో వార్షిక కౌలు జమ చేసింది ప్రభుత్వం.. రాజధాని రైతుల వార్షిక కౌలు నిమిత్తం రూ.6.64 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం.. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, భూ యజమానులకు ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన వార్షిక కౌలు ఈ రోజు జమ చేసింది.. అయితే, రైతుల బ్యాంక్ ఖాతాల లింకేజీ ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక కారణాల వలన కొందరు రైతులకు సొమ్ము జమ కాలేదు.. కొంతమంది రైతులు తమ ప్లాట్లను విక్రయించినందున, అదే విధంగా మరణించిన రైతుల యొక్క వారసుల ఖాతాల సర్టిఫికెట్ ఇవ్వడంలో ఆలస్యం జరిగింది.. కౌలు లబ్ధి జమ చేయడానికి నిర్ణీత ధ్రువపత్రాలు అధికారులకు అందిన తర్వాత కౌలు జమ చేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.. మరోవైపు, పలువురు రైతుల ఖాతాలలో 9వ, 10వ, 11వ ఏడాదికి సంబంధించి సొమ్ము కూడా జమ కానుట్టగా గుర్తించారు.. ఈ తరహా సమస్యలను పరిష్కరించిన సీఆర్డీఏ.. 495 మందికి అందాల్సిన పెండింగ్ వార్షిక కౌలు నిధులు విడుదల చేసింది..
Read Also: VD15: కాంబినేషన్ అదిరింది.. విజయ్ దేవరకొండ కొత్త మూవీ స్టార్ట్!