Ravindra Jadeja: ‘ఖమ్మా ఘనీ’ రాజస్థాన్.. రవీంద్ర జడేజా రాయల్స్ ఎంట్రీ మాములుగా లేదుగా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Jadeja: టీ20 ప్రపంచ కప్ 2026 పూర్తయింది. ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్ఠి ఐపీఎల్ పై పడింది. ఇక ఐపీఎల్ 2026 సంబంధించి అన్ని జట్లు వారికి అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్ లు కూడా మొదలు పెట్టేశాయి. అలాగే అన్ని జట్లు వారి ఆటగాళ్లతో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశాయి. ఇందులో భాగంగానే రాజస్థాన్ రాయల్స్ జట్టు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి తన పాత గూటికి (రాజస్థాన్ రాయల్స్) చేరుకోవడంతో.. ఫ్రాంచైజీ అదిరిపోయే రీతిలో స్వాగతం పలికింది. ఇందుకు సంబంధించిన వీడియో నెత్తిన సంచనాలు సృష్టిస్తుంది.
Also Read
బాలీవుడ్ హిట్ చిత్రం ‘ధురంధర్’లో అక్షయ్ ఖన్నా పోషించిన ఐకానిక్ పాత్ర ‘రెహ్మాన్ దకైత్’ను గుర్తుకు తెచ్చేలా రాజస్థాన్ రాయల్స్ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. 84 సెకెన్స్ ఉన్న ఈ వీడియోలో జడేజా ఓ పక్కా రాజస్థానీ సంప్రదాయ వేషధారణలో అలరించాడు. సినిమాలో రెహ్మాన్ దకైత్ చెప్పే డైలాగ్ ను పోలి ఉండేలా, జడేజా.. “ఖమ్మా ఘనీ, రాజస్థాన్” అంటూ అభిమానులను పలకరించడం ఇప్పుడు తెగ వైరల్‌గా మారింది.
2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో షేన్ వార్న్ సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ గెలిచినప్పుడు జడేజా కీలక సభ్యుడుగా ఉన్నాడు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత సిఎస్‌కె (CSK) నుంచి రూ. 14 కోట్లకు ట్రేడ్ అవ్వడం ద్వారా జడేజా తిరిగి తన ఐపీఎల్ కెరీర్ మొదలైన జట్టుకే చేరుకున్నారు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో భారీ మార్పులు జరిగాయి. సంజూ శాంసన్ జట్టును వీడటంతో, యువ ఆటగాడు రియాన్ పరాగ్ పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
స్టార్ ఆల్‌రౌండర్లు జడేజాతో పాటు ఇంగ్లండ్ స్టార్ సామ్ కర్రన్, డొనోవన్ ఫెరియెరా ట్రేడ్ ద్వారా జట్టులోకి వచ్చారు. వీరికి తోడు జట్టులో యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మైర్ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. మరోవైపు జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ మరియు క్వేనా మఫాకా వంటి బౌలర్లతో పదునైన బౌలింగ్ ఉంది.
𝐊𝐡𝐚𝐦𝐦𝐚 𝐆𝐡𝐚𝐧𝐢, 𝐑𝐚𝐣𝐚𝐬𝐭𝐡𝐚𝐧 🔥⚔️
Ravindrasinh Jadeja has arrived for IPL 2026 💗 pic.twitter.com/fVUVl5zTjZ
— Rajasthan Royals (@rajasthanroyals) March 10, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?