ఛార్జిషీట్లో ఏసీబీ కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలపై ఈ రోజు కౌంటర్ దాఖలు చేసింది సిట్.. ప్రైమరీ ఛార్జ్‌షీట్, రెండో అదనపు ఛార్జిషీట్ లో మొత్తం 20కి పైగా అభ్యంతరాలు లేవనెత్తి.. నివృత్తి చేయాలని సిట్‌కు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేయగా.. వీటిని నివృత్తి చేస్తూ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సిట్.. సీల్డ్ కవర్ లో రెండు ఛార్జిషీట్లలో అభ్యంతరాలపై విడివిడిగా కౌంటర్లు కోర్టుకు సమర్పించింది సిట్..
జరిగిన ప్రమాదాలకు ఎక్స్ గ్రేషియా అందించడం సమాధానం కాదు.. అసలు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పని చేయాలని సూచించారు ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. విద్యుత్ శాఖలో జరుగుతున్న ప్రమాదాలపై కారణాలను అడిగి తెలుసుకున్నారు..
ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహంచారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్ కె. విజయానంద్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.. ఎరువుల లభ్యత, సరఫరా, పక్కదారి పట్టకుండా తీసుకుంటున్న చర్యలపై ఈ సమీక్షలో చర్చించారు..
రైతులకు కూలి ఖర్చులు కూడా రావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. వేంపల్లి మండలం తాళ్లపల్లిలో ఉల్లి పంటను పరిశీలించారు.. అయితే ఉల్లి పంటికి గిట్టుబాటు ధర లభించడంలేదంటూ మాజీ సీఎంకు మొరపెట్టుకున్నారు రైతులు.. దళారులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో రూ.4 వేల నుంచి రూ.12 వేల వరకు మద్దతు ధర ఇచ్చామని గుర్తుచేశారు..
HBD Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టినా.. తనకంటూ ఓ ప్రత్యేక స్టైల్.. తాను అంటే చెప్పలేనంత ఫాలోయింగ్ సంపాదించుకున్నారు పవన్ కల్యాణ్.. తక్కువ కాలంలోనే ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన ఆయన.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లోయింగే .. ఇక, ఈ ఏడాది పవన్ కల్యాణ్‌కు బర్త్‌డే ప్రత్యేకమనే చెప్పాలి.. సినీ గ్లామర్‌తో పాలిటిక్స్‌లోకి వచ్చిన ఆయన.. ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు.. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీతో జతకంటి.. ఏపీలో కూటమి […]
ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.. పదేళ్లుగా ఒక హత్య కేసులో స్టే ఎలా పొడిగిస్తున్నారని ప్రశ్నించింది న్యాయస్థానం.. ఇకపై వాయిదాలు వేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది..
వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక, ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో తమ కుటుంబసభ్యులతో కలిసి నివాళులు అర్పించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆ తర్వాత మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు జగన్.. ఆయనతో పాటు.. వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, కోడలు వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు ఈ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు..
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతోంది ఉపరితల ఆవర్తనం.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. ఇక, అల్పపీడనం ప్రభావంతో ఇవాళ విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ఆరెంజ్ బులెటిన్ హెచ్చరికలు జారీ చేసింది విశాఖపట్నం వాతావరణ కేంద్రం..