AP Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది.. అయితే, నిందితుడు అద్దేపల్లి జనార్ధన్ ఫోన్ విషయంలో వివాదం కొత్త మలుపు తీసుకుంటుంది.. ఆఫ్రికా నుంచి ఇండియా వచ్చే మార్గంలో ముంబైలో తన ఫోన్ పోయిందని ఎక్సైజ్ అధికారులకు చెప్పారు జనార్ధన్.. దీంతో, అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో జనార్ధన్ ఫోటోను జియో సిబ్బందితో తీయించిన ఎక్సైజ్ సిబ్బంది.. అయితే, తన పేరుతో కొత్త సిమ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని జనార్ధన్ ఆరోపిస్తున్నారు.. అరెస్ట్ చేసిన వ్యక్తి పేరుతో కోర్టు అనుమతి లేకుండా, రిమాండ్ రిపోర్ట్ లో కొత్త సిమ్ గురించి ప్రస్తావించ కుండా చేయటంపై కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు జనార్ధన్.. అయితే, కొత్త సిమ్ తీసుకున్నారా? లేదా పాత సిమ్ తో వేరే వారికి ఫోన్స్ చేయనున్నారా? అనే అనుమానాలపై విచారణ చేయాలని జనార్ధన్ పిటిషన్ వేయనున్నారట..
మరోవైపు, కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన కీలక నిందితుడు అద్దేపల్లి జనార్ధన్ మద్యం సిండికేట్ లింకులు బయటపడుతున్నాయి.. జనార్ధన్ తో పాటు లిక్కర్ వ్యాపారం కలిసి చేస్తున్న బొర్రా కిరణ్ కు సంబంధించిన బార్ కూడా ఇబ్రహీంపట్నం పరిధిలోనే ఉన్నట్టు అధికారులు గుర్తించారు.. వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌లో ఈ సెవెన్ బార్‌లో భాగస్వామ్యలుగా ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు. జనార్ధన్‌కు సంబంధించిన ఏఎన్ఆర్ బార్ లో కల్తీ మద్యం అమ్మకాలు జరిగినట్టు గుర్తించిన అధికారులు.. సమీపంలోనే ఉన్న బొర్రా కిరణ్ బార్ లో కూడా ఈ కల్తీ మద్యం అమ్మకాలు జరిగినట్టుగా అనుమానిస్తున్నారు.. బొర్రా కిరణ్ ను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కల్తీ మద్యానికి సంబంధించి కాళీ బాటిల్స్ సరఫరా చేసిన శ్రీనివాస్ రెడ్డి బంధువులు పాతూరు రోడ్ లో ఒక బార్ ను నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ బార్ లో కూడా జనార్ధన్‌కు వాటాలు ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు.. ఆ బార్ లో కూడా కల్తీ మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు అనుమానిస్తున్నారు.. దీంతోపాటు జనార్ధన్‌కు వాటాలు కలిగిన అతను సిండికేట్‌లో అన్ని బార్లను అధికారులు కల్తీ మద్యం అమ్మకాలపై విచారణ చేయటానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు తనకు బెయిల్ ఇవ్వాలని జనార్ధన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు..