Sameera Reddy: ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలని ఒత్తిడి చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా పరిశ్రమలోని ‘కలర్ డిస్క్రిమినేషన్’ సహా బాడీ షేమింగ్‌పై నటి సమీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినీ పరిశ్రమలో ఒకప్పుడు వరుస సినిమాలు చేసి తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన సమీరా రెడ్డి, ఇప్పుడు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.తనను సినిమా పరిశ్రమలో ఉన్న తెల్లతోలు వ్యామోహం బాగా ఇబ్బంది పెట్టినట్టు చెప్పుకొచ్చింది. అసలు రంగు కంటే ఇంకా తెల్లగా కనిపించాలని, ముఖానికే కాక ఎక్కడైతే బయటకు కనిపిస్తుందో అక్కడ శరీరానికి కూడా మేకప్ వేసుకోవాలని ఒత్తిడి చేసేవారని ఆమె తెలిపింది.
Also Read:Manchu Manoj: డేవిడ్ రెడ్డి కోసం మనోజ్ షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్
Also Read
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
అలా వాళ్లు చెప్పడం వల్ల, తాను అంత అందంగా ఉండనేమో అన్న భావన కలిగేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఎత్తు తక్కువగా ఉండటం వల్ల లావుగా ఉందంటూ విమర్శలు చేసేవారని, ఇక్కడ (సినీ పరిశ్రమలో) టాలెంట్ కన్నా కూడా బాహ్య సౌందర్యానికే ప్రాధాన్యత ఇవ్వడం తనను తీవ్రంగా కలచివేసినట్లు ఆమె పేర్కొంది. పెళ్లి తర్వాత మొదటి సంతానం అనంతరం, ‘పోస్ట్-పార్టమ్ వెయిట్ గైన్’ వల్ల ఆమె తన ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది. ఆ సమయంలో కూడా సమాజం నుంచి ఎదురైన విమర్శలు మానసిక వేదనకు గురిచేశాయని తెలిపింది. కానీ రెండోసారి తల్లి అయినప్పుడు మాత్రం తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను అని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన తర్వాత తనకు కొత్త సమస్య ఎదురైందని.. తెల్లబడిన తన జుట్టుని, పెరిగిన బరువుని చూసి నెటిజన్లు దారుణమైన కామెంట్స్ చేసేవారని చెప్పుకొచ్చింది. “ప్రస్తుతం నాకు ఆ నెగటివ్ కామెంట్స్ చూస్తే ఏమీ అనిపించడం లేదు. వాటిపై నేను న్యూట్రల్‌గా ఉన్నాను.” అని సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!