కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తలకు అలర్ట్.. శ్రీవాణి దర్శన సమయాల్లో మార్పులు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). టికెట్ తీసుకున్న రోజే దర్శనం కల్పిస్తోంది. ఈ ప్రయోగం రేపటి నుంచి అమలుకానుంది. శ్రీవాణి టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను సాయంత్రం నాలుగున్నర గంటలకు దర్శనానికి అనుమతించనుంది.
వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన కాసేపట్లో ప్రారంభంకానుంది. జనసమీకరణ చేయొద్దని పోలీసులు చెప్తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షల నడుమ వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన కొనసాగనుంది. తాడేపల్లిలోని నివాసం నుంచి నెల్లూరు చేరుకుంటారు జగన్. సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శిస్తారు. తర్వాత కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్తారు జగన్. కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు
కృష్ణమ్మ పరుగులు తీస్తోంది.. కృష్ణా బేసిన్ లోని అన్ని ప్రాజెక్టులు నిండిపోవడంతో.. ప్రకాశం బ్యారేజీ వైపు పరుగులు తీస్తోంది కృష్ణమ్మ.. అయితే, అంతకంతకు నీటి ప్రవాహం పెరుగుతుండడంతో.. అధికారులు అప్రమత్తం అయ్యారు.. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం పెరుగుతోన్న నేపథ్యంలో.. మొత్తం 70 గేట్లను ఎత్తివేశారు అధికారులు..
డయాఫ్రమ్ వాల్ 25,238 చదరపు మీటర్లు పూర్తి చేసి 40 శాతం పురోగతి సాధించాం అన్నారు.. డయాఫ్రమ్ వాల్ 373 ప్యానల్స్ గాను, ఇప్పటికే క్రిటికల్ గా ఉన్న 130 ప్యానల్స్ పూర్తి చేయడం జరిగింది. వరద కాలంలో కూడా డయాఫ్రమ్ వాల్ పనులు ఆగకుండా, డివాటరింగ్ చేసుకుంటూ 2025 డిసెంబర్ కు పూర్తి చేస్తాం అన్నారు..
కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నేత పిల్లి సుభాష్ చంద్రబోస్.. ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు యూరియా కొరత ఏర్పడిందని.. ఏపీకి 1.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినా రైతులకు యూరియా అందడం లేదని.. యూరియా అనేక చోట్ల దాచిపెడుతున్నారు అని ఆరోపించారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలని చూస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్ రెడ్డిను ములాఖత్ లో కలిశారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు.. ఈ సందర్భంగా ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కోర్టులో ఆర్డర్ ఇచ్చినా అన్నింటిలో వేలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తుందన్నారు.. మిథున్‌రెడ్డిని జైలులో టెర్రరిస్టులు, మావోయిస్టులను చూసినట్టు చూస్తున్నారు అని మండిపడ్డారు..
ఏలూరులో సీబీఐ వలకు చిక్కాడు విజయవాడకు చెందిన ఐటీ ఇన్స్పెక్టర్.. ఏలూరులోని ఓ మొబైల్ షాపు యజమాని నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా అధికారులకు ఫిర్యాదు చేశారు.. దీంతో, సీబీఐ వలవేసి ఆ అధికారిని పట్టుకుంది.. కాగా, ఏలూరు రామచంద్రరావుపేటలో ఉన్న సెల్‌ఫోన్ సర్వీస్ షాపు యజమానిపై విజయవాడలోని ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ కార్యాలయానికి పలు ఫిర్యాదులు వెళ్లాయి..