విజయవాడ మెట్రో ప్రాజెక్టులో మరో కీలక అడుగు..
విజయవాడ నగర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడబోతోంది. విజయవాడ మెట్రో ప్రాజెక్ట్‌పై వేగం పెంచిన ఏపీఎంఆర్సీ.. ఈ నెల 14న టెండర్లకు ముహూర్తం ఖరారు చేసింది. ఏలూరు రోడ్, బందరు రోడ్ ఈ రెండు కారిడార్లకు కలిపి ఒకే సింగిల్ టెండర్ విధానం ద్వారా ప్రక్రియను చేపట్టనుంది. సుమారు రూ.4,500 కోట్ల వ్యయంతో టెండర్లను ఆహ్వానించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రీ-బిడ్డింగ్ మీటింగ్‌లో 10కి పైగా బడా కంపెనీలు పాల్గొన్నాయి. జాయింట్ వెంచర్ విధానంలో పోటీకి రంగంలోకి దిగేందుకు పలువురు నిర్మాణ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నాయి. ముందుగా టెక్నికల్ బిడ్లు, ఆ తర్వాత ఫైనాన్షియల్ బిడ్లు తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన సంస్థలకు టోపోగ్రఫీ, జియోగ్రాఫికల్ సర్వేలు .. సాయిల్ టెస్టులు నిర్వహించనున్నారు.. ఈ సర్వేలకు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కేంద్ర అనుమతులు లభించగానే క్షేత్ర స్థాయిలో మెట్రో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏలూరు రోడ్‌పై డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రతిపాదనను కూడా ఏపీఎంఆర్సీ సిద్ధం చేసింది. డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర ఉపరితల రవాణా శాఖకు పంపించింది. అనుమతులు లభిస్తే, విజయవాడ మెట్రో పనులు ఇక ఎలాంటి అడ్డంకులు లేకుండా దూసుకెళ్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
నన్ను అంతం చేయాలని కుట్ర.. బొత్స సంచలన వ్యాఖ్యలు
శాసనమండలి విపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు.. పైడితల్లి పండుగలో తనని అవమానించాలనో.. అంతమొందించాలనో కుట్ర చేశారా అని అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రోగ్రాం షెడ్యూల్ ఇచ్చాం.. కానీ, అది పట్టించుకోలేదు.. ఇది కుట్రతో జరిగిందా..? లేక అధికారుల అలసత్వమా? మమ్మల్ని అవమానించాలన్న ఉద్దేశమా? లేక అంతమొందించాలన్నదా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పైడితల్లి అమ్మవారి పండుగ నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ మండలి పక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. పైడితల్లి అమ్మవారి జాతరలో ప్రభుత్వం ప్రమాణాలు పాటించలేదని, సంప్రదాయాలను పక్కనబెట్టి అహంకారంతో వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజలందరికీ పైడితల్లి అమ్మవారు ఇలవేల్పుగా ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ఉత్సవాల సమయంలో రాజకీయాలు చేయదు.. కానీ, ఈసారి అధికారంలో ఉన్న ప్రభుత్వం, అధికారులు సంప్రదాయాలను తుంచేశారు అని బొత్స విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ, ఎమ్మార్వో, ఎండీవో, ఎక్సైజ్, ఇలా అన్ని శాఖల్లోనూ హుండీ పెట్టి డబ్బు సేకరణ చేయడం ఏమిటి? వీరు సివిల్ సర్వెంట్లా..? ఇది ధర్మమా? అని ప్రశ్నించారు. తనకి ఏర్పాటు చేసిన స్టేజ్ కూలిపోయిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారని పేర్కొన్నారు.. ఈ విషయమై గవర్నర్, సీఎస్ లకు లేఖ రాస్తానన్నారు. ప్రభుత్వ అలసత్వమే దీనంతటికీ కారణం. అధికారులపై ప్రభుత్వానికి పట్ట లేకపోవడం వల్లే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి అని ధ్వజమెత్తారు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ..
వేడి వేడి టీ తాగి బాలుడు మృతి
తల్లి దండ్రులు చేసిన ఓ పొరపాటు నాలుగేళ్ల బాలుడి ప్రాణం తీసింది.. మంచినీరు అనుకుని పొరపాటును వేడి వేడి టీ తాగడంతో ఆస్పత్రి పాలైన బాలుడు.. చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు విడిచాడు.. అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యాడికిలోని చెన్నకేశవస్వామి కాలనీలో రామస్వామి, చాముండేశ్వరి దంపతులు నివాసం ఉంటున్నారు.. వీరికి నాలుగేళ్ల రుత్విక్, రెండేళ్ల వయస్సు ఉన్న యశస్విని అనే పిల్లలు ఉన్నారు.. అయితే, మూడు రోజుల క్రితం ఇంట్లో ఫ్లాస్క్‌లో ఉంచిన టీని మంచినీరుగా భావించి తాగాడు.. టీ వేడిగా ఉండడంతో అల్లాడిపోయిన నాలుగేళ్ల బాలుడు స్పృహతప్పి పడిపోయాడు.. దీంతో, వెంటనే చికిత్స కోసం తాడిపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు… అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.. కానీ, వైద్యులు ఆ బాలుడి ప్రాణాలు కాపాడలేకపోయారు.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు బాలుడు… ముద్దు ముద్దు మాటలతో తమ మధ్య తిరిగి బాలుడు మృతిచెందడంతో.. ఆ తల్లిదండ్రుల దుఖః ఆపడం ఎవరికీ సాధ్యం కావడం లేదు.. రుత్విక్, యశశ్విని ఇద్దరూ వేడి టీ తాగినా.. గొంతులోపల గాయం కావడంతో రుత్విక్ మాత్రం చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీసీ రిజర్వేషన్ల పై సుప్రీంకోర్టుకు..
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల పై సుప్రీంకోర్టు కి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. హైకోర్టు తీర్పు ను స్టడీ చేసిన ప్రభుత్వం.. సీనియర్ కౌన్సిల్ తో సుప్రీంకోర్టు లో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. అభిషేక్ మను సింగ్వి తో పాటు సిద్ధార్థ దవే.. రిజర్వేషన్ల పై ప్రావీణ్యం కలిగిన అడ్వకేట్ లతో వాదనలు వినిపించాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా హైకోర్టు జీవో 9పై స్టే విధిస్తూ, 2 వారాల్లో పిటిషనర్లు కౌంటర్ దాఖలు చేయాలని, అలాగే 4 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. తాజాగా బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు ఆర్డర్ కాపీ వెలువడింది. జీఓ 9, 41, 42 ల పై హైకోర్టు స్టే విధించింది. ట్రిపుల్ టెస్టు పాటించకపోవడం పై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు మించి ఉండడాన్ని తప్పుబట్టింది. తదుపరి విచారణ డిసెంబర్ 3 కు వాయిదా వేసింది. వికాస్ కృష్టా రావు గవాలి, రాహుల్ రమేష్ వాగ్ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను హైకోర్టు పరిగణలోకి తీసుకున్నది.
బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు ఆర్డర్ కాపీ.. జీఓ 9, 41, 42 ల పై స్టే
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 ను తీసుకొచ్చింది. దీని ప్రకారమే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కల్పించాలని భావించింది. జీవో 9 ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. అయితే జీవో 9పై పలువురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు జీవో 9పై స్టే విధిస్తూ, 2 వారాల్లో పిటిషనర్లు కౌంటర్ దాఖలు చేయాలని, అలాగే 4 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. తాజాగా బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు ఆర్డర్ కాపీ వెలువడింది. జీఓ 9, 41, 42 ల పై హైకోర్టు స్టే విధించింది. ట్రిపుల్ టెస్టు పాటించకపోవడం పై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు మించి ఉండడాన్ని తప్పుబట్టింది. తదుపరి విచారణ డిసెంబర్ 3 కు వాయిదా వేసింది. వికాస్ కృష్టా రావు గవాలి, రాహుల్ రమేష్ వాగ్ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను హైకోర్టు పరిగణలోకి తీసుకున్నది.
4 రోజుల క్రితం రాజీనామా.. మళ్లీ ప్రధానిగా లెకోర్ను నియామకం
ఫ్రాన్స్‌లో ప్రధానమంత్రుల మార్పిడి ఆట సాగుతోంది. ఎప్పుడు.. ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏడాదిలో నలుగురు ప్రధానమంత్రులు మారారంటే ఫ్రాన్స్‌లో ఏం జరుగుతుందో ఈపాటికే అర్థమైంటుంది. నెలరోజుల క్రితమే సెబాస్టియన్ లెకోర్ను (39) ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నాలుగు రోజుల క్రితం కేబినెట్ ఏర్పాటు చేసిన కొన్ని గంటలకే లెకోర్ను ప్రధాని పదవికి రాజీనామా చేశారు. మద్దతుదారులు బెదిరించడంతో ప్రధాని పదవికి లెకోర్ను రాజీనామా చేశారు. మళ్లీ కొత్త వ్యక్తి వస్తారనుకుంటే మాక్రాన్ షాకిచ్చారు. లెకోర్ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు సన్నిహితుడు. తిరిగి నాలుగు రోజుల తర్వాత కూడా తిరిగి లెకోర్నును ప్రధానిగా నియమించారు. ప్రభుత్వ ఏర్పాటు చేసే బాధ్యతను ఆయనకు అప్పగించారు. మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు కొత్త ముఖం కోసం ఆశించాయి. కానీ తిరిగి మరొకసారి లెకోర్ను వైపే మాక్రాన్ మొగ్గుచూశారు. రాజకీయ సంక్షోభాన్ని చక్కదిద్దాలని మాక్రాన్ ఆకాంక్షించారు. అయితే పున:నియామకంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మిత్రపక్షాలు సహకరించే పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదు. మళ్లీ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది నుంచి ఫ్రాన్స్‌లో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. హంగ్ పార్లమెంట్‌తో కారణంగా ఒడుదుడుకులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు మళ్లీ లెకోర్ను పునఃనియమించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మళ్లీ ఏమవుతుందో వేచి చూడాలి.
అమెరికాలోని ఓ ప్లాంట్‌లో పేలుడు.. 19 మంది మృతి!
అగ్ర రాజ్యం అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టేనస్సీ పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. 19 మంది చనిపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. సైనిక, అంతరిక్ష, వాణిజ్య పరిశ్రమలకు పేలుడు పదార్థాలను ఉత్పత్తి చేసే కంపెనీలో ఈ పేలుడు సంభవించింది. ఇక పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు కంపించాయి. దీంతో ప్రజలంతా హడలెత్తిపోయారు. ఏం జరిగిందో అర్థం కాక భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి అగ్నిమాపక సిబ్బంది కూడా సకాలంలో చేరుకోలేని పరిస్థితి నెలకొంది. హంఫ్రీస్ కౌంటీ షెరీఫ్ క్రిస్ డేవిస్ మాట్లాడుతూ.. ఇది వినాశకరమైన పేలుడుగా అభివర్ణించారు. ఉదయం పూట ఈ ఘటన జరిగినట్లుగా తెలిపారు. చాలా మంది ఆచూకీ తెలియడం లేదని.. ప్రస్తుతం కొంత మంది వ్యక్తులు మాత్రమే సజీవంగా ఉన్నారని చెప్పారు. మిగతా వారంతా చనిపోయి ఉంటారని తెలిపారు. శుక్రవారం ఉదయం 7:45 గంటలకు ప్రమాదం జరిగినట్లుగా పేర్కొన్నారు. ఇక ప్రమాదం తర్వాత భవనం శిథిలావస్థకు చేరుకుంది. అంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగి ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇక ఈ ప్రమాదంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
మళ్ళీ ప్రేమలో పడిన హార్దిక్ పాండ్యా..? కొత్త లవర్ ఎవరో తెలుసా..?
ఈ రోజు టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పుట్టిన రోజు. అక్టోబర్ 11, 1993న గుజరాత్‌లో జన్మించాడు. భారత క్రికెట్‌లో కపిల్‌దేవ్ తర్వాత ఆ స్థాయి ఆల్‌రౌండర్ ఎవరు..? ఈ ప్రశ్నకి సుదీర్ఘకాలం తర్వాత హార్దిక్ పాండ్యా ఓ సమాధానంలా నిలిచాడు. టీమిండియాలోకి అరంగేట్రం చేసిన తొలినాళ్లలోనే తన పేస్ బౌలింగ్‌తో పాటు పవర్ హిట్టింగ్‌తోనూ స్టార్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఎదిగాడు. కానీ.. ఈ మూడేళ్ల క్రికెట్ కెరీర్‌లో ఆట కంటే ఆటేతర కారణాలతో హార్దిక్ పాండ్యా ఎక్కువగా ఇబ్బందులు పడ్డాడు. అనంతరం.. హార్దిక్ పాండ్యా అంటేనే ఓ వివాదంలా మారిపోయాడు. కానీ.. ఎన్ని అడ్డంకులు వచ్చిన తన చక్కటి ప్రదర్శనతో అన్నింటికీ చెక్ పెడుతూనే ఉంటాడు. అయితే.. తాజాగా హార్దిక్ పాండ్యా మరోసారి ప్రేమలో పడ్డాడు? క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇటీవల ముంబై విమానాశ్రయంలో తన స్నేహితురాలు, మోడల్-నటి మహికా శర్మతో కలిసి కనిపించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. మహికా, హార్దిక్ ఇద్దరూ నల్లటి దుస్తులలో కనిపించారు. ఇంతకీ మహికా శర్మ ఎవరు అనే ప్రశ్న మొదలైంది. అయితే.. మహికా తనిష్క్, వివో, యునిక్లో వంటి ప్రధాన బ్రాండ్ల ప్రకటనలలో కనిపించింది. ఫ్యాషన్ ప్రపంచంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
అదిరిపోయే అప్‌డేట్.. ప్రభాస్ మరో సినిమా రిలీజ్ డేట్ లాక్?
హీరో ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రెబల్ స్టార్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. అయితే, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమాన్వి ఈ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. అయితే, సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ మూవీ దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తైనట్లు తెలుస్తుంది. అలాగే, ప్రభాస్‌కు సంబంధించిన సన్నివేశాలు ఇంకా 35 రోజుల పాటు మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకి ‘ఫౌజీ’ అనే పేరు పరిశీలనలో ఉందని టాలీవుడ్ సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించి సినీ వర్గాల్లో పలు ఆసక్తికర ముచ్చట్లు వెలుగులోకి వచ్చాయి. దేశ భక్తి అంశాలతో మిళితమై ఉన్న ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 2026 ఆగస్టు 15వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఈ మూవీ 60శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాకి ప్రీక్వెల్ చేసే ఆలోచనతో ఉన్నట్లు కూడా జోరుగా ప్రచారం కొనసాగుతోంది. కాగా, దీనిపై సినీ యూనిట్ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ మూవీలో ప్రభాస్ భారత సైనికుడిగా నటిస్తుండగా.. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఇక, ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇది 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన రిలీజ్ కానుంది.
నాకు పెళ్లి చేయండి, హనీమూన్కి కూడా మీరే ప్లాన్ చేసేయండి
22 ఏళ్లుగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా త్రిష కృష్ణన్ కొనసాగుతోంది. 42 ఏళ్ల వయసులోనూ, 22 ఏళ్ల హీరోయిన్లకు ధీటుగా సవాల్ విసిరే అందం, ఫిట్‌నెస్‌తో చెలరేగిపోతుంది. గతంలో ఓ సారి ఎంగేజ్మెంట్ వరకూ వెళ్లి, క్యాన్సిల్ చేసుకున్నది ఈ చెన్నై చిన్నది. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం ఇష్టం లేకనే ఒంటరిగానే ఉండిపోయింది. కానీ, ఇప్పుడు త్రిష పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని కోలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఇక, ఈ విషయంపై నటి త్రిష తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. చండీగఢ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమె పెళ్లి జరగబోతుందంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలను తిప్పికొట్టింది. ఈ మేరకు శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీస్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. అయితే, నా లైఫ్ గురించి వేరే వాళ్లు ప్లాన్ చేస్తుంటే నాకు చాలా ఇష్టం.. ఇక వాళ్లే నా పెళ్లి గురించి, నా హనీమూన్‌ను కూడా ఎప్పుడు ఫిక్స్ చేస్తారా అని వేచి చూస్తున్నాను అని త్రిష పోస్టులో పేర్కొంది. ఈ సెటైర్‌తో తన పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చినట్లైంది. తన పెళ్లిపై వచ్చిన పుకార్లను ఎవరు పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపింది. కాగా, ఈ నెల ఆరంభంలో చెన్నైలోని తేనాంపేటలో ఉన్న ఆమె నివాసానికి బాంబు బెదిరింపు హెచ్చరికలు రావడం తీవ్ర కలకలం రేపింది.
కల్కి 2 సినిమాలో ఆలియా భట్..?
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898AD’.. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘కల్కి 2898 పార్ట్ 2’ తెరకెక్కబోతుంది. అయితే, కొన్ని సమస్యలతో సీక్వెల్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను తప్పించినట్టుగా చిత్ర యూనిట్ పేర్కొనింది. సీక్వెల్ నుంచి దీపికాని తప్పించడంతో ‘కల్కి 2898 పార్టీ 2’ సినిమాలో ఆమె పాత్రను ఎవరు చేస్తారు? అనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అయితే, ‘కల్కి-2’ మూవీపై తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటించాల్సిందిగా మూవీ టీమ్ సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, టాలీవుడ్ వర్క్ కల్చర్, ఆలియాకి బాగా సుపరిచితమే కాబట్టి.. సుమతి రోల్‌కి ఆమె సరిగ్గా సెట్ అవుతుందని నాగ్ అశ్విన్ అండ్ టీమ్ భావిస్తున్నారట. కాగా, దీనిపై నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నుంచి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. మరోవైపు, పార్ట్-1లో ‘కల్కి’ని గర్భంలో మోస్తున్న ‘సుమతి’ అనే మహిళ పాత్రలో దీపిక నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రకు ఎవరైతే బాగుంటారో అనే అంశంపై నెట్టింట భారీ చర్చ కొనసాగుతుంది.