Perni Nani: మాజీ మంత్రి పేర్నినానికి షాకిచ్చిన పోలీసులు..
- మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పీఎస్‌లో కేసు నమోదు..
- నిన్న R పేట సీఐతో పేర్ని నాని వాగ్వివాదం..
- ఈ విషయంపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్..
- ఈ పరిణామాల నేపథ్యంలో పేర్ని నాని పై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి షాకిచ్చారు పోలీసులు.. ఆర్.పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేశారంటూ చిలకలపూడి పోలీసు స్టేషన్‌లో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు.. అయితే, వైసీపీ నేత సుబ్బన్నను నిన్న (శుక్రవారం) విచారణకు పిలిచారు మచిలీపట్నం టౌన్ పోలీసులు.. ఈక్రమంలో ఆ పీఎస్‌కు వెళ్లిన పేర్ని నాని.. సీఐపై సీరియస్ అయ్యారు.. ఓ దశలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.. మాజీ మంత్రి పేర్ని నానిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.. ఈ నేపథ్యంలో.. పేర్ని నానిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. పేర్ని నాని సహా 29 మందిపై కేసు నమోదు చేశారు..
Read Also: Trump Health : ట్రంప్ హెల్త్ రిపోర్ట్‌లో విస్తుపోయే విషయాలు.. వయసు పెరుగుతున్నా.. అది మాత్రం…
Also Read
కాగా, మాజీ మంత్రి పేర్ని నాని నేతృత్వంలో మెడికల్ కళాశాల వద్ద ఇటీవల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు వైసీపీ నేతలు.. కాలేజీలో పరీక్షలు జరుగుతున్నాయని, నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు వారించే ప్రయత్నం చేశారు.. వారితో వాగ్వాదానికి దిగిన వైసీపీ నేతలు.. పోలీసుల లాఠీలు లాక్కున్నారు. దీంతో ఈ ఘటనలో 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు.. 41ఏ నోటీసులు ఇచ్చారు. పీఎస్‌కు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. అయితే, తాను చెప్పేవరకూ ఎవరూ పోలీసుల వద్దకు వెళ్లవద్దదు అంటూ వైసీపీ సిటీ ప్రెసిడెంట్ మేకల సుబ్బన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు.. నిన్న సుబ్బన్నను అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని.. వైసీపీ శ్రేణులతో కలిసి మచిలీపట్నం టౌన్ పీఎస్‌కు వెళ్లారు.. సీఐ గదిలోకి వెళ్లి ఆయనతో వాగ్వాదానికి దిగారు.. పేర్ని నానితో పాటు వైసీపీ నేతలు కొందరు సీఐపై విరుచుకుపడ్డారు.. సీఐకి వేలు చూపిస్తూ.. వార్నింగ్ ఇచ్చేంత పనిచేశారు.. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు. ఇప్పుడు పేర్ని నాని సహా 29 మంది కేసు నమోదు చేశారు..
తాజావార్తలు
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
-
Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..