AP Government: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..!
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న సర్కార్..
- పదోన్నతుల కల్పనకు ప్రభుత్వం కసరత్తు..
- పదోన్నతుల కల్పనపై అధ్యయనానికి మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధం అవుతోంది ఏపీ సర్కార్.. వారికి పదోన్నతుల కల్పనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. పదోన్నతుల కల్పనపై అధ్యయనానికి మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.. పది మంది మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. జీవోఎం కమిటీలో సభ్యుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు.. ఇక, జీవోఎం కమిటీలో మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి, పయ్యావుల కేశవ్, నారాయణ, సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు, అనిత, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, గుమ్మిడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు.. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి పదోన్నతులు ఇచ్చే విభాగాలు, పద్ధతులపై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం..
Read Also: Nobel Prize in Economics 2025: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి..
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
ఇంటర్మీడియరీ పోస్టులు సృష్టిస్తే వాటికి పే స్కేల్ నిర్ణయించాలని పేర్కొంది సర్కార్.. ఇంటర్మీడియరీ పోస్టుల సృష్టిపై చర్చించాలని జీవోఎంను ఆదేశించింది ప్రభుత్వం.. ఇతర విభాగాల్లో ఒకే పని స్వభావం కల్గిన ప్రమోషన్ ఛానల్ కల్పించే అంశంపై అధ్యయనం చేయాలని తెలిపింది.. పదోన్నతులు ఖరారు చేసేందుకు సంబంధిత విభాగాలకు సూచనలు జారీ చేయాలని పేర్కొంది.. పదోన్నతుల తర్వాత హేతుబద్దీకరణ నిబంధనల ప్రకారం ఖాళీలు భర్తీ చేసే పద్ధతిపై చర్చించాలని ఆదేశించింది.. వీలైనంత త్వరగా అధ్యయనంపూర్తి చేసి సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!