అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని తీర్చిదిద్దాల్సిన గురువే మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం మాచవరం గ్రామంలో చోటుచేసుకుంది. 4 నెలల క్రితం 9వ తరగతి విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు లైంగిక దాడికి తెగపడ్డాడు.
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది.. నాసాతో కలిసి కీలక ప్రయోగానికి రెడీ అయ్యింది.. రేపు జీఎస్ఎల్వీ - ఎఫ్ 16 రాకెట్‌ను ప్రయోగించనుంది.. దీని కోసం ఇవాళ మధ్యాహ్నం 2.10 గంటలకి కౌంట్ డౌన్‌ను ప్రారంభించనుంది.. కౌంట్‌డౌన్ ప్రక్రియ పూర్తి చేసి.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో లాంచ్ పాడ్ నుంచి రేపు సాయంత్రం 5.40 గంటలకి ప్రయోగాన్ని చేపట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు..
సింగపూర్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడుపుతున్నారు.. రెండు రోజుల పాటు కీలక సమావేశాలు, చర్చల్లో పాల్గొన్న ఆయన.. మూడు రోజు సింగపూర్ అధ్యక్షుడు, మంత్రులు, పలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు కాబోతున్నారు.. ముఖ్యంగా నేడు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్ రంగాలపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు..
నాకు పదవుల మీద ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాకు పదవులపై ఆశ లేదు.. కానీ, జనసేన కార్యకర్తగా ఉండటమే నాకు ఇష్టం అన్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డక జనసేనలో ఎటువంటి కమిటీ వేయలేదు... జనసేన సైనికులు ఓర్పుతో పార్టీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు..
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఎంపీ మిథున్‌రెడ్డి తల్లి స్వర్ణలత కన్నీళ్లు పెట్టుకున్నారు. జైలులో నా కుమారుడిని టెర్రరిస్టుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ లో కలిశారు ఆయన కుటుంబ సభ్యులు.. అందులో మిథున్‌రెడ్డి తల్లి స్వర్ణలత, చెల్లి శక్తి రెడ్డి, బావ అఖిల్ ఉన్నారు.. ములాఖాత్ తర్వాత మీడియాతో మాట్లాడిన మిథున్‌రెడ్డి తల్లి స్వర్ణలత.. సెంట్రల్ జైలులో తన కుమారుడికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని కన్నీటి పర్వంతమయ్యారు.…
ఎవర్వోల్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశం అయ్యారు. 2029నాటికి ఆంధ్రప్రదేశ్ లో 160 గిగావాట్ల పునరుత్పాదకం ఇంధన సామర్థ్యం కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని. ఇందుకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ – 2024ను ప్రకటించాం అన్నారు... రెన్యూ, సుజలాన్ వంటి బడా సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయని... ఆంధ్రప్రదేశ్ లో పెద్దఎత్తున సోలార్ సెల్, మాడ్యూల్, బ్యాటరీ తయారీ యూనిట్…