విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు.. ఈ సమయంలో.. ఒక్కో రోజు.. ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు..
రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సింగపూర్లో రెండో రోజు పర్యటిస్తోన్న ఆయన.. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖలోని మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ తో సమావేశం అయ్యారు.. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి టాన్ సీ లాంగ్ తో చర్చించారు..
తిరుమలలో వీఐపీల దర్శనంపై కీలక వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. వీఐపీలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలంటూ సూచించారు.. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి నిన్న తిరుమల చేరుకున్న వెంకయ్య నాయుడు.
తెలుగు రాష్ట్రాలు కళ్యాణ శోభ సంతరించుకున్నాయి. ఎటు చూసినా పెళ్లిళ్ల సందడే కనిపిస్తుంది. శ్రావణ మాసం రావడంతో శుభకార్యాలకు మంచి ముహూర్తాలున్నాయి. దీంతో లక్షల్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మూఢం, ఆషాఢం కారణంగా 48 రోజుల పాటు శుభకార్యాలు జరగలేదు. దీంతో బంగారం, వెండి ఆభరణాల షాపులు వెలవెలబోయాయి. వస్త్ర దుకాణాల్లో బిజినెస్ పడిపోయింది. కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు బోసిపోయాయి. పురోహితులకు పని లేకుండా పోయింది. కానీ... శ్రావణం వస్తూనే సందడి మొదలైంది. పెళ్లిళ్లు, శుభకార్యాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు జనం.
భారత దేశం అంటే హిందువులు. సెక్యులర్ దేశమని, లౌకిక రాజ్యమని ఎంత చెప్పుకున్నా.. దేశంలో 80 శాతం పైన హిందువులే. కానీ హిందువులు ఓ మతం కాదు. ఓ జాతి. అది భారతదేశపు జాతి. హిందూ ధర్మం, సనాతన ధర్మం ఈరోజు పుట్టుకొచ్చింది కాదు. వేల ఏళ్ల నుంచి హిందూ మతం ఉంది. ఇప్పుడు బీజేపీ మాత్రం సనాతన ధర్మానికి కొత్త నిర్వచనాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అలాగే మతానికీ, రాజకీయాలకూ ముడిపెడుతోంది. కానీ ఈ దేశంలో ప్రజలెప్పుడూ మతాన్ని, రాజకీయాన్ని కలగలిపి చూడలేదు.…
ముక్క లేకుంటే ముద్ద దిగాని వాళ్లు చాలా మంది ఉన్నారు. కనీసం వారానికి ఒకసారైనా మసాలా రుచి చూడకుంటే మనసు లాగేస్తుంది. ప్రతీ పూటా నాన్వెజ్ లాగించేవారు కూడా ఉన్నారు. ఈ డిమాండ్ను ఆసరాగా తీసుకుని నంద్యాల జిల్లాలో చికెన్ సిండికేట్ ఏర్పాటైంది. డోన్లో వీరు కోసిందే కోడి..! చెప్పిందే రేటు అన్నట్టు తయారైంది పరిస్థితి.
ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశమవుతోంది. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల కోసం గవర్నర్కు పంపిన ముసాయిదాపై చర్చించబోతోంది. సిగాచి అగ్నిప్రమాదంపై నివేదిక, సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల అంచనాల సవరణపై డిస్కస్ చేసే అవకాశం వుంది. మరోవైపు కాళేశ్వరంపై కేబినెట్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టే ఛాన్స్ వుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం పర్యటన సింగపూర్లో కొనసాగుతోంది.. ఇవాళ రెండో రోజు సీఎం చంద్రబాబు మరింత బిజీగా గడపనున్నారు.. ఎయిర్ బస్, హనీవెల్, ఎవర్వోల్ట్ ప్రతినిధులతో సమావేశాలు కాబోతున్నారు.. రెండోరోజు పర్యటనలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సహా.. పలు సంస్థల అధిపతులతో సమావేశంకానున్నారు.. నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై వారితో చర్చించబోతున్నారు..