CBN Meets PM Modi: హస్తినకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. సుమారు 45 నిముషాల పాటు ప్రధాని మోడీతో చంద్రబాబు నాయుడు ముఖాముఖి సమావేశం జరిగింది.. ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు ప్రధాని మోడీ.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.. మొదట శ్రీశైలం మల్లికార్జున స్వామి , భ్రమరాంబికా దేవిని దర్శించుకోనున్న ఆయన.. కర్నూలులో నిర్వహిస్తున్న “సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” కార్యక్రమానికి హాజరుకానున్నారు.. ఇక, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు.. అయితే, ప్రధాని మోడీని “సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” కార్యక్రమానికి ఆహ్వానించారు సీఎం చంద్రబాబు..
Read Also: YSRCP: కురుపాం ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు..
మరోవైపు, నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో తలపెట్టిన “సీఐఐ—పార్టనర్షిప్ సమ్మిట్” కు హాజరుకావాలని కూడా ప్రధాని నరేంద్ర మోడీని సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది.. ఇక, రేపు ఉదయం 10 గంటలకు తాజ్ మాన్ సింగ్ హోటల్ లో “గూగుల్” సంస్థతో ఒప్పంద కార్యక్రమంలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విశాఖలో “గూగుల్” డాటా సెంటర్ ఏర్పాటుపై ఏపీ ఐటీ శాఖ, గూగుల్ సంస్థల ప్రతినిధులు “అవగాహన ఒప్పందం” (ఎమ్.వో.యూ) పత్రాలపై సంతకాలు చేయనున్నారు.. రేపు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు “ఎమ్.వో.యూ” కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సీఎం చంద్రబాబు..