కరీంనగర్లో గుంతలు ఉన్న రోడ్డుపై కూర్చుని వాహనదారుడు నిరసన తెలిపారు.. నిబంధనలు పాటించకపోతే మాకు వేసే జరిమానాలు సరే.. మరి రోడ్లు బాగులేనందుకు మీరు నాకు ఎంత చెల్లిస్తారు జరిమానా అంటూ.. రేకుర్తి చౌరస్తా వద్ద రోడ్డుపై నిరసనకు దిగాడు కోట శ్యామ్ అనే ద్విచక్రవాహనదారుడు.. గుంతలు ఉన్న రోడ్డులో కూర్చుని నిరసన తెలిపాడు.
లిక్కర్ కేసులో మరిన్ని కీలకమైన ఆధారాలు సేకరించింది సిట్.. చెవిరెడ్డి, విజయనందా రెడ్డి కంపెనీల సోదాల్లో లావాదేవీలకు సంబంధించిన మరింత కీలకమైన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి..
నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది.. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.. సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. ఎస్ఐపీబీ నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. పలు సంస్థలకు భూ కేటాయింపులు, అసెంబ్లీ సమావేశాలపై చర్చించే అవకాశం ఉంది.. కాగా, ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం..
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..?
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.. గణేష్ మండపం పక్కన చికెన్ భోజనాలు ఏర్పాటు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో 30 మందిపై కేసు నమోదు చేశారు నందిగామ పోలీసులు.
యూరియా పేరుతో భారీ స్కామ్ జరిగింది.. రెండు వందల కోట్ల మేర చేతులు మారాయని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన. చంద్రబాబు మాటలు ప్రకటనలకే పరిమితం .. యూరియా కొరత ఉండదని రైతులు ఆందోళనలు చేస్తున్నా.. చర్యలు శున్యం అన్నారు..
తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి కావాలని.. పోలీస్ భద్రత కల్పించాలంటూ జిల్లా ఎస్పీ జగదీష్ ను కోరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాను తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని.. ఆ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భద్రత కల్పించాలని కోరినట్లు సమాచారం.