Road Accident: క్యాన్సర్ నుంచి కాపాడుకుందామనుకుంటే.. రోడ్డుప్రమాదం మింగేసింది..
- యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడపకు చెందిన హర్ష (9) మృతి..
- కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న హర్ష..
- మనోనాధామ్ గల బావిలో నీళ్లు తాగితే క్యాన్సర్ పోతుందని యూట్యూబ్ రీల్స్ చూసిన తండ్రి..
- హర్షను తీసుకుని మనోనాధామ్ వెళ్లిన అతని తండ్రి, బాబాయ్..
- బావి నీళ్ల కోసం 3 కిలోమీటర్ల క్యూలో ఉన్న క్యాన్సర్ రోగులు..
- నీళ్లు తీసుకోకుండానే తిరుగు ప్రయాణం.. రోడ్డు ప్రమాదంలో మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: క్యాన్సర్‌తో బాధపడుతున్న కొడుకును బతికించుకోడానికి ఊరు కాని ఊరు వెళ్లాడు ఓ తండ్రి.. కానీ, రోడ్డు ప్రమాదంలో.. అది కూడా తండ్రి కళ్ల ఎదుటే.. ఆ కొడుకు కన్నుమూయడంతో ఆయన బాధను వర్ణించడం సాధ్యం కావడం లేదు.. క్యాన్సర్‌నుంచి కొడుకుని రక్షించుకోడానికి ఆస్పత్రుల చుట్టూ తిరిగిన ఆ తండ్రి ఆవేదనను ఆ దేవుడు కూడా ఆలకించలేదు. రోడ్డు ప్రమాదరూపంలో కళ్ల ముందే కొడుకును మరణించడంతో ఆ తండ్రి వేదన చెప్పనలవి కాకుండా ఉంది.
Also Read
- Pulivendula Tension: పులివెందులలో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ అభ్యర్థుల ఇళ్ల వద్ద వాహనాల దహనం
- Kadapa: ప్రొద్దుటూరులో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఇంటిపై దాడి!
- Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్‌కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కడపకు చెందిన పాలది శ్రీహరి కొడుకు హర్షకు 9 ఏళ్లు. రెండేళ్ల నుంచి హర్ష మెటాస్టాటిక్ న్యూరోబ్లాస్టోమా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. కొడుకు వైద్యానికి ఇప్పటికే కోటిన్నరకుపైగా ఖర్చు చేశారు హర్ష తండ్రి. అయినా, లాభంలేకుండాపోయింది. అయితే, ఉత్తర్ ప్రదేశ్‌లోని మనోనాధామ్లో బావిలో నీళ్లు తాగితే క్యాన్సర్ పోతుందని యూట్యూబ్ రీల్స్ లో చూశారు. కొడుకును రక్షించుకోవాలన్న తపనతో గత శనివారం తిరుపతి నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మనోనాధామ్ కు వెళ్లారు. అక్కడికి వెళ్తే మూడు కిలో మీటర్ల క్యూ ఉంది. అది చూసిన ఆ బాలుడు వెనక్కి వెళ్లిపోదాం డాడీ.. ఇక్కడ వద్దు అనడంతో సోమవారం తెల్లవారుజామున క్యాబ్ లో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు బయల్దేరారు.. మార్గం మధ్యలో తెల్లవారు జామున 3 గంటలలకు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో హర్ష అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో హర్ష తండ్రి తలకు బలమైన గాయంకాగా… ఆయన తమ్ముడు, తమ్ముడు కూతురికి, క్యాబ్ డ్రైవర్ కు గాయాలు అయ్యాయి.
తాజావార్తలు
-
Trump: ఒప్పందం చేసుకోకపోతే మళ్లీ దాడి చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
-
BC Study Circle: బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రతీ నెల ఇచ్చే స్టైఫండ్ పెంపు..
-
RGIA: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ..
-
META Smart Glasses: రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ల దుమారం.. ఆ మెటా గ్లాసెస్ మిస్టరీ ఏంటి?
-
GREEN CRACKERS: ఈ దీపావళికి ఊపిరి పీల్చుకోవడం సాధ్యమేనా?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!