త్వరలోనే ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. తాము కూడా ఎన్నికలు రెడీగా ఉన్నామని చెప్పారు. నెత్తిమీద కుంపటిని దించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమన్నారు చంద్రబాబు. రేపో ఎల్లుండో సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారన్న చంద్రబాబు.. రోజు రోజుకూ పతనావస్థకు వెళ్తున్నారని.. మరిన్ని రోజులు గడిస్తే వ్యతిరేకత పెరుగుతుందని సీఎం భయపడుతున్నారని తెలిపారు.. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా […]
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలపై స్పందించారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి. ధరలు ప్రపంచ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయన్నారు. ఎన్నికల కోసమే ధరలు పెంచకుండా ఆపారన్న ప్రతిపక్షాల విమర్శలు కొంతవరకు నిజమే కావొచ్చన్నారు. ధరల పెంపుపై ఆయిల్ కంపెనీలే నిర్ణయం తీసుకుంటాయన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుందన్నారు హర్దీప్ సింగ్ పురి. ఇక, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో దేశంలో ముడి చమురు కొరత ఉండదని, చమురు కంపెనీలే ఇంధన ధరలను నిర్ణయిస్తాయని […]
ఉక్రెయిన్‌పై యుద్ధం రష్యాకు భారంగా మారింది. ప్రపంచ దేశాలు విధిస్తోన్న ఆంక్షలకు రష్యా అల్లాడిపోతోంది. వ్యాపారాలు ఊహించని స్థాయిలో దెబ్బతిన్నాయి. ప్రస్తుతం రష్యాపై 5వేలకు పైగా ఆంక్షలుండగా… అందులో 2,700కు పైగా గత 10 రోజుల్లో విధించినవే. ప్రపంచంలో నార్త్ కొరియా, ఇరాన్ లాంటి దేశాల కంటే రష్యాపైనే ఎక్కువ ఆంక్షలు అమలవుతున్నాయి. మరోవైపు మల్టీ నేషనల్ కంపెనీలన్నీ యుద్ధానికి నిరసనగా రష్యాలో తమ ఆపరేషన్స్ ఆపేశాయి. కొన్ని కంపెనీలైతే రష్యా మార్కెట్ నుంచి పూర్తిగా వెళ్లిపోతున్నట్టు […]
వనపర్తిలో జరిగిన బహిరంగసభలో.. రేపు ఉదయం కీలక ప్రకటన చేస్తాను.. రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు అంతా టీవీలు చూడండి అంటూ ప్రకటించి అందరిలో ఆసక్తిపెంచారు సీఎం కేసీఆర్.. ఇక, దీనిపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ కోటమిరెడ్డి వెంకట్‌రెడ్డి.. రేపు నిరుద్యోగుల కోసం ఉదయం 10 గంటలకు ప్రకటన చేస్తానని కేసీఆర్ అనడం సంతోషాన్ని కలిగించింది.. రాష్ట్ర ప్రజలలో ఒకడిగా నేను రేపటి మీ ప్రకటన కోసం వేచి చూస్తున్నాను అన్నారు.. మీ 2018 ఎన్నికల […]
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు.. అయితే, సీఎం పర్యటనకు మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు డుమ్మా కొట్టారు.. సీఎం కార్యక్రమానికి పూర్తిగా దూరంగా ఉన్నారు జూపల్లి… అంత వరకు లైట్‌గా తీసుకోవచ్చేమో.. కానీ, ఇదే సమయంలో ఖమ్మంలో టీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పిడమర్తి రవితో జూపల్లి ప్రత్యేకంగా చర్చలు జరపడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా […]
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఈ నెల 10వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి.. ఇక, సోమవారం పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌లో మరోసారి యూపీలో విజయం సాధించేది బీజేపీయేనని స్పష్టమైంది.. అన్ని సర్వేలు.. మరోసారి యూపీలో యోగి సర్కార్ కొలువు తీరబోతోందని స్పష్టం చేశాయి.. అయితే, మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల కమిషన్‌ను మేం నమ్మడం లేదన్న ఎస్పీ చీఫ్.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని […]
కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది… ఇక, అంతర్జాతీయ ప్రయాణాలపై అనేక ఆంక్షలు విధించారు.. ప్రత్యేకంగా ఎంపిక చేసిన మార్గాలు, అది కూడా ప్రభుత్వ అనుమతితో.. మరీ ముఖ్యంగా ప్రత్యేక పరిస్థితుల్లో నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇక, త్వరలోనే రెగ్యులర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.. దీనిపై కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం… ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునః ప్రారంభిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ వెల్లడించింది.. కోవిడ్ […]
వనపర్తి బహిరంగ సభా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. దేశంలో గోల్ మాల్ గోవిందం గాళ్లు మోపు అయ్యారని.. దేశాన్ని ఆగం పట్టించే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ప్రజలకు మత పిచ్చి లేపి.. కుల పిచ్చి లేపి.. దుర్మార్గమైన చర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. చైతన్యం ఉన్న గడ్డగా, తెలంగాణ బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉండగా అటువంటి అరాచకాన్ని తెలంగాణలో రానివ్వను అని ప్రకటించిన కేసీఆర్.. […]
ఆంధ్రప్రదేశ్‌లో అచ్చెన్నాయుడు, ఆర్కే రోజా మధ్య సవాళ్ల పర్వం హాట్ టాపిక్‌గా మారిపోయింది… ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీకి 160 సీట్లు వస్తాయంటూ అచ్చెన్నాయుడు పెద్ద జోక్ చేశారని ఎద్దేవా చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. తిరుపతి ఎంపీ ఎన్నికల సమయంలో ‘పార్టీ లేదు.. తొక్కా లేదు’ అన్న వ్యక్తి ఇప్పుడు 160 సీట్లంటూ జోక్ చేస్తున్నారని.. నువ్వు గానీ చంద్రబాబు నాయుడు గానీ తలకిందులుగా తపస్సు చేసినా 160 సీట్లు కాదు కదా.. ఇప్పుడున్న […]
రేపు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేయనున్నట్టు వెల్లడించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. వనపర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రేపు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నాను.. నిరుద్యోగుల కోసం కీలక ప్రకటన రేపు చేస్తాను.. అందరూ గమనించాలి.. రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులంతా టీవీలు చూడాలని సూచించారు. అసెంబ్లీలో మార్చి 9న బుధవారం ఉదయం 10 గంటలకు నిరుద్యోగ యువ సోదరుల కోసం ప్రకటన […]