ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇవాళ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే కాగా, ఆ సమావేశంలో కీలక కామెంట్లు చేశారు జగన్.. రాబోయే రెండేళ్లు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలోనే ఉండాలని స్పష్టం చేశారాయన.. ఇక, త్వరలోనే వైఎస్సార్ సీఎల్పీ సమావేశం జరగనుంది.. అసెంబ్లీ బడ్జెట్ సమావేవాలు జరుగుతుండగానే వైఎస్సార్ సీఎల్పీ భేటీ ఉంటుందని తెలిపారు సీఎం జగన్… గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన అనంతరం […]
తెలంగాణ సర్కార్, గవర్నర్ మధ్య గ్యాప్ పెరుగుతూ పోతోంది.. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంపై ఇప్పటికే ఘాటుగా స్పందించారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఇక, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఇప్పటికీ మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదన్న ఆమె.. అత్యున్నత పదవిలో ఉన్నవారికి కూడా సరైన గౌరవం దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక, నన్ను ఎవరూ భయపెట్టలేరని.. […]
కరోనా మహమ్మారి విజృంభణ ప్రభావం శ్రీవారి దర్శనాలపైనే కాదు.. ఆర్జిత సేవలు సహా వివిధ సేవా కార్యక్రమాలపై కూడా పడింది.. అయితే, క్రమంగా కరోనా కేసులు తగ్గి.. మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తుండడంతో కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం.. శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించనుంది.. ఆర్జిత సేవలకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, […]
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఈ నెల 10వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.. అయితే, ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు? అధికారంలోకి వచ్చేది ఎవరు? ఓడేదెవరు? అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.. ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారి కోసం.. కొన్ని సర్వే ఏజెన్సీలు, న్యూస్ చాలెన్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి.. వాటి ప్రకారం మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించనుండగా… ఒక రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవిర్భవించబోతోంది ఆమ్ఆద్మీ పార్టీ, ఇక, […]
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ్టితో ముగిసింది.. మొత్తం ఏడు దశలుగా పోలింగ్ నిర్వహించగా.. ఉత్తరప్రదేశ్లో ఏడో మరియు చివరి దశ ఓటింగ్ ఈరోజు ముగిసింది.. దీనితో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసినట్టు అయ్యింది.. ఇక, ఈ నెల 10వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, ఈలోపే ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి.. ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది […]
పసిడి ప్రేమికులకు షాకిస్తున్నాయి వరుసగా పెరిగిపోతున్న ధరలు.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర అమాంతం పెరిగిపోయింది.. ఈ రోజు స్పాట్ బంగారం ధర ఔన్స్కు 1.5 శాతం పెరిగి 1,998.37 డాలర్లకు ఎగబాకింది.. ఇక, యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.7 శాతం పెరిగి 2,000.20 డాలర్లకు పెరిగింది.. అంతర్జాతీయ పరిస్థిత ప్రభావం దేశీయ మార్కెట్పై స్పష్టంగా కనిపించింది.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర 1.89 శాతం పెరిగి రూ.53,550 […]
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.. ముఖ్యమంత్రి వైఎస్ జన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేబినెట్.. పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై కూడా నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఇక, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఓ సారి పరిశీలిస్తే.. ★ స్టేట్ వక్ఫ్ ట్రిబ్యునల్లో 8 రెగ్యులర్, 4 అవుట్ సోర్సింగ్ పోస్టులకు కేబినెట్ ఆమోదం.★ రాష్ట్రంలో ఎంపిక చేసుకున్న వారికి తెలుగుతో పాటుగా ఉర్ధూను […]
తెలంగాణ కుంభమేళ, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర వైభవంగా ముగిసిన విషయం తెలిసిందే.. ఇక, జాతర ముగియడం, మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోవడంతో.. హుండీ లెక్కింపు చేపట్టారు.. ఇవాళ సమ్మక్క-సారలమ్మ హుండీ లెక్కింపు పూర్తి చేశారు.. ఈసారి హుండీ ఆదాయం రూ.11 కోట్లను దాటేసింది.. రూ.11 కోట్ల 44 లక్షలు 12 వేల 707 రూపాయలు హుండీ ద్వారా లభించినట్టు ప్రకటించారు.. ఇక, బంగారం 631 గ్రాములు, వెండి […]
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ్టితో ముగిసింది.. మరో మూడు రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి.. ఇదే సమయంలో మరో ఎన్నికలకు సిద్ధం అవుతోంది కేంద్ర ఎన్నికల సంఘం.. ఆరు రాష్ట్రాల్లోని 13 స్థానాలకు ఎన్నికలకు జరగనుండగా.. ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది.. అస్సాంలో 2, హిమాచల్ ప్రదేశ్ లో 1, కేరళలో 3, నాగాలాండ్ లో 1, త్రిపురలో 1, పంజాబ్లో 5 రాజ్యసభ స్థానాలు.. ఇలా మొత్తం 13 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్లో ఖాళీ […]
తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టి ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వస్తున్న వైఎస్ షర్మిల.. ఆంధ్రప్రదేశ్లోనూ పార్టీ పెడుతున్నారా? అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.. ఆ మధ్య మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పారు వైఎస్ షర్మిల. రాజకీయ పార్టీ అన్నది ఎవరైనా.. ? ఎక్కడైనా పెట్టవచ్చు అన్నారు. ఏపీలో పార్టీ పెడితే ఏమైనా తప్పా అని ఎదురు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో తాను రాజకీయ పార్టీ పెట్టకూడదని […]