BJP: టిడ్కో ఇళ్లపై వైసీపీ సర్కార్‌కు బీజేపీ డెడ్‌లైన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టిడ్కో ఇళ్ల కేటాయింపులపై వైసీపీ ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. ఆగస్టు 15వ తేదీలోగా టిడ్కో ఇళ్లను కేటాయించాలని వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ జీవీఎల్ గడువు పెట్టారు.. 30 లక్షల ఇళ్లు ఇస్తున్నామని చెబుతోన్న ప్రభుత్వం అక్కడ ఏం చేయలేదన్న ఆయన.. ఏపీలో టిడ్కో ఇళ్ల కోసం కేంద్రం రూ. 12 వేల కోట్లు కేటాయించిందన్నారు.. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఎలాట్ చేయకుంటే.. బీజేపీ ఉద్యమిస్తుందని ప్రకటించారు.. రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుంటే రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్రమే అలాట్‌మెంట్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు.
Read Also: Amit Shah : హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్ షా
Also Read
మరోవైపు, మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు జీవీఎల్.. మూడు రాజధానులనేవి ఉత్తుత్తి మాటేనని తేల్చేసిన ఆయన.. మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం చేయలేదన్నారు.. మూడు రాజధానులపై బిల్లు తెచ్చే అవకాశమే ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకే వెళ్లేదన్న ఆయన.. మూడు రాజధానులనేది ఉత్తుత్తి మాటే.. మళ్లీ మూడు రాజధానుల బిల్లు తెస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపుతో మాట్లాడుతోందని మండిపడ్డారు. ఇక, బీజేపీ అమరావతికే కట్టుబడి ఉందని స్పష్టం చేసిన బీజేపీ ఎంపీ.. కోర్టు తీర్పును ధిక్కరించేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం భ్రమలు కల్పించిందని.. గత మూడేళ్లుగా రాజధాని పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కించిందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!