Work from home: వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా..? అయితే ఇదిగో రాజీనామా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ఒక్కసారిగా జీవన విధానాన్నే మార్చేసింది.. ఆఫీసు, కాలేజీ, స్కూలు, ఇలా ఎక్కడికి వెళ్లకుండా… అంతా ఇంట్లోనే ఉంటూ.. పని చేసుకునే విధంగా.. చదువుకునే విధంగా.. ఎన్నో మార్పులకు కారణమైంది.. వర్క్‌ఫ్రమ్ హోం, ఆన్‌లైన ఎడ్యుకేషన్.. ఇలా కొత్త విధానాన్ని పరిచయం చేసింది.. అయితే, ఇప్పుడు అదే చాలా సమస్యలకు దారితీస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.. కరోనా నిబంధనలు పాటించాలన్న ఆదేశాలతో సుదీర్ఘ కాలంగా ఆయన సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఇంటికే పరిమితం చేశాయి.. అయితే, తిరిగి ఆఫీస్‌కు వచ్చేందుకు ఉద్యోగులు ఇష్టపడడం లేదని ఓ నివేదిక వెల్లడించింది.
వర్క్ ఫ్రమ్ హోం విషయంలో వెయ్యి మంది ఉద్యోగులపై ఓ సర్వే నిర్వహించగా.. అందులో 39 శాతం మంది ఉద్యోగులు.. తమకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతించకపోతే.. తాము చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధమని వెల్లడించారు.. ఇక, 1990 నుంచి 2010 మధ్య కాలంలో జన్మించిన ఉద్యోగుల్లో 49శాతం మందికి పైగా వర్క్‌ఫ్రమ్ హోం చేసే సామర్ధ్యం ఉందని, అలా చేయడం వల్ల వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- Ethanol in Diesel: డీజిల్‌లో ఇథనాల్‌కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
ప్రతిష్టాత్మక సంస్థల నుంచి చిన్న సంస్థల వరకు ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని తెలుస్తోంది.. వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దన్నందుకు ఇప్పటికే వందల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను వదిలేశారట.. ఈ వారమే యాపిల్ సంస్థ వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దని, ఆఫీస్‌కు వచ్చి చేయాలన్న కారణంగా యాపిల్ సంస్థ ఏఐ డైరెక్టర్ ఇయాన్ గుడ్‌ఫెల్ రాజీనామా ప్రకటించగా.. కోడింగ్ స్టార్టప్ వైట్ హాట్ జూనియర్‌కు చెందిన 800మంది ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలకు వదిలేశారు.. దీంతో, కొన్ని సంస్థలు.. రిటర్న్ టూ ఆఫీస్‌కు బదులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేందుకే మొగ్గుచూపుతున్నట్టు ఆ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..