Thammineni Seetharam: స్పీకర్ సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ ఇక ప్యాకప్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం… టీడీపీ ఇక ప్యాకప్ అనేశారు.. పొట్టలో కత్తులు పెట్టుకుని పొత్తులకు సిద్దమవుతున్నారు… అవన్నీ పొలిటికల్ ఫిలాసఫీ లేని పార్టీలు అని ఫైర్ అయిన ఆయన.. పొలిటికల్ ఫిలాసఫీతో సీఎం జగన్ ఉన్నారు… అందుకే సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తు.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపిస్తున్నారని తెలిపారు.. పిల్లల విద్యా కోసం నాడు నేడు, విద్యా దీవెన, అమ్మ ఒడి.. ఇలా అనేక కార్యక్రమాలు రూపొందించారని.. కానీ, గతంలో జన్మ భూమి కమిటీలు ఇచ్చినదే ఫైనల్ లిస్ట్ అంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు… పూర్తి పారదర్శకంగా అర్హులను గుర్తించి ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.
Read Also: BJP: టిడ్కో ఇళ్లపై వైసీపీ సర్కార్‌కు బీజేపీ డెడ్‌లైన్..
Also Read
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
గ్రామంలో పరిపాలన ఉండాలనే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనను డీసెంట్రలైజ్ చేశారని ప్రశంసలు కురిపించారు తమ్మినేని సీతారాం… ఎందరు కలిసినా జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొలేరు.. గడపగడపకు మన ప్రభుత్వంలో అందరూ పాల్గొంటున్నారు… ప్రజల మద్దతు లభిస్తుందన్నారు. ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు… పాలసీ లేకుండా .. విధానం లేకుండా పొత్తులు పెట్టుకుంటే పొట్టలో కత్తులు పెట్టున్నట్టే అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీని చంద్రబాబు, అశోక్ ఇతర టీడీపీ నాయకులూ సమర్ధిస్తారా? అని అడుగుతున్నా… మాల్ ప్రాక్టీసును మీరు సమర్ధిస్తున్నారా… సూటిగా చెప్పండి అంటూ నిలదీశారు. చట్టం తన పని తను చేస్తుంది… విచారణ జరిపి చర్యలు తీసుకుంటానన్నారు.
రాజకీయ మధ్యవర్తి లేకుండానే పథకాలన్నీ లబ్ధిదారులకు చేరుతున్నాయన్న తమ్మినేని.. మా ముఖ్యమంత్రి పాలనలో మిడిల్ మ్యాన్ వ్యవస్థకు తావు లేదు.. పవిత్రమైన వ్యవస్థలను ఏర్పాటు చేశారని తెలిపారు. వాలంటీర్లు నేరుగా లబ్ధిదారులు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రజలలో కన్ఫ్యూజన్ చేయడానికి సర్కస్ ఫీట్స్ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!