Breaking: త్రిపుర సీఎం రాజీనామా.. బీజేపీ అధిష్టానం వేటు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్.. తన పదవికి రాజీనామా చేశారు.. వచ్చే ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.. తన రాజీనామాను గవర్నర్ ఎస్ఎన్ ఆర్యకు సమర్పించినట్లు తెలిపారు బిప్లబ్ కుమార్ దేబ్.. ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం దేబ్ ఈ విషయాన్ని ప్రకటించారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి నేను పని చేయాలని పార్టీ కోరుకుంటోంది.. అందుకే సీఎం పదవికి రాజీనామా చేసినట్టు ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Sunil Jakhar: కాంగ్రెస్‌కి బిగ్ షాక్.. కీలక నేత గుడ్ బై.. గుడ్ లక్..!
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
అయితే, బీజేపీ రాష్ట్ర శాఖలో అంతర్గత పోరు నివేదికల నేపథ్యంలో బిప్లబ్ రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది.. ఇక, త్రిపురలోని బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కాబోతోంది.. తర్వాత సీఎం ఎవరు అనేది ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు.. శాసనసభా పక్ష నేత ఎన్నికకు పరిశీలకులుగా బీజేపీ సీనియర్ నేతలు భూపేందర్ యాదవ్, వినోద్ తావ్డేలను నియమించింది అధిష్టానం.. ఇప్పటికే వీరు త్రిపురకు చేరుకున్నారు.. మరోవైపు, గత గురువారం ఢిల్లీ వెళ్లిన బిప్లబ్ కుమార్ దేబ్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.. అంటే, రాజీనామా చేయాలనే అప్పుడే ఆయనకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం సాగుతోంది.. త్రిపుర పార్టీలో అంతర్గత కుమ్ములాటలే బిప్లవ్ దేవ్‌పై వేటు పడడానికి కారణంగా ప్రచారం సాగుతోంది. కాగా, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న జిష్ణు దేవ్ వర్మ త్రిపుర కొత్త సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!