Iran War: అమెరికా-ఇరాన్ యుద్ధంతో పుతిన్‌కు లాభం, రష్యాకు సంతోషం..
- ఇరాన్ యుద్ధంతో పుతిన్‌కు లాభం..
- రష్యా ఆయిల్‌కు పెరిగిన డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయిల్ విరుచుకుపడుతున్నాయి. ఈ యుద్ధం ప్రారంభమై 10 రోజులు గడిచినా తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. మరోవైపు, ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైయిన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలపై దాడులు చేస్తోంది. ఈ దేశాల్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలను డ్రోన్లు, మిస్సైళ్లతో దెబ్బకొడుతోంది. ఇదిలా ఉంటే, చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్మూజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేసింది. దీంతో చాలా దేశాల్లో చమురు సంక్షోభం నెలకొంది.
మొత్తం, ఈ యుద్ధంతో లాభపడిన దేశం ఏదైనా ఉందా అంటే అది రష్యా. రష్యా చమురు ఎంత అవసరమే ఇప్పుడు ప్రపంచానికి తెలిసి వస్తోంది. యూరప్ రష్యా గ్యాస్, చమురు కోసం ప్రాధేయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు ఈ పరిస్థితి చాలా మేలు చేయనుంది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా ఆర్థిక పరిస్థితి దిగజారింది. యూరప్ దేశాలు, అమెరికా రష్యాపై చాలా ఆంక్షలు విధించాయి. 2 అతిపెద్ద రష్యన్ చమురు కంపెనీలపై ఆంక్షలు ఉన్నాయి.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
Read Also: PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 22వ విడత రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజే ఖాతాల్లోకి
రష్యా చమురు వ్యాపారాన్ని బలహీనం చేయాలని అమెరికా చాలా పనులు చేసింది. చైనా, భారత్ వంటి పెద్ద దేశాలు రష్యా ఆయిలు కొనకుండా ఉండేందుకు టారిఫ్స్ అస్త్రాన్ని ట్రంప్ ప్రయోగించారు. ఇరాన్ యుద్ధం వేళ, అంతర్జాతీయ చమురు ధరల్ని స్థిరీకరించేందుకు రష్యా ఆయిల్ కొనుగోలు చేయాలని ఇదే ట్రంప్ భారత్ వంటి దేశాలను కోరడం విశేషం.
ఇప్పుడు, ఇరాన్ యుద్ధం మొత్తం చిత్రాన్ని మార్చేసింది. హార్ముజ్ జలసంధిని మూసేయడం యూరప్ వ్యాప్తంగా ఇంధన కష్టాలు మొదలయ్యాయి. చమురు ధరలు ఒక్కసారిగా బ్యారెల్ ధర 100 డాలర్లకు పెరిగింది. ఇప్పుడు ఈ పరిస్థితి రష్యా చమురుకు డిమాండ్ తీసుకువచ్చింది. దీంతో రాబోయే కాలంలో రష్యన్ చమురు ఎగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే , భారత అవసరాలను తీర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు రష్యా ప్రకటించింది. భారత్ రష్యన్ ఆయిల్‌ను ప్రాసెస్ చేసి, యూరప్ దేశాలకు అమ్ముకోవచ్చు. దీంతో అటు రష్యాకు, ఇటు భారత్‌కు రెండింటికి ప్రయోజనం చేకూరుతుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..