కరోనా పుట్టినిల్లు చైనాలో ఇప్పటికీ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.. డ్రాగన్ కంట్రీ నుంచి ప్రపంచదేశాలను చుట్టేసి కోవిడ్.. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్.. ఇలా విరుచుకుపడుతూనే ఉంది.. అయితే, ఇటీవలే ఒమిక్రాన్ వేరియంట్ల కారణంగా చైనీయులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు వెలుగు చూస్తుండడంతో.. కట్టడికోసం సుదీర్ఘ లాక్‌డౌన్‌లు విధిస్తోంది చైనా సర్కార్.. దీంతో, ప్రజలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి.. ఇదే సమయంలో ఆదేశా అధ్యక్షుడిగా ఉన్న జిన్‌పింగ్ తన పదవికి రాజీనామా చేస్తున్నారనే వార్త గుప్పుమంది.. ప్రస్తుతం ఆ వార్త సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
Read Also: Minister Peddireddy: ఇల్లు కట్టినా, బంగారం నాణేలు పంచినా బాబు గెలవడు..!
కోవిడ్ కట్టడిలో విఫలం అయిన అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై చైనా కమ్యూనిస్టు పార్టీ గుర్రుగా ఉందట.. దేశ ఆర్థికవ్యవస్థ పతనానికి జిన్‌పింగ్ తప్పుడు నిర్ణయాలే కారణమని.. అందుకే జిన్‌పింగ్ రాజీనామా చేయాలని చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. ఇటీవలే సీపీసీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సమావేశం జరగగా.. ఆ తర్వాత ఈ ప్రచారం జోరందుకుంది.. వాటి ప్రకారం.. ఈ ఏడాది చివరల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన సమావేశం నిర్వహించబడే వరకు, జిన్‌పింగ్.. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నుండి వైదొలగవలసి వస్తుంది అనే ప్రచారం చైనా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.