తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధం అవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇటీవలే మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించిన ఆయన.. కుప్పంలో ఇల్లు కడుతున్నా.. ప్రతీ మూడు నెలలకు నియోజకవర్గంలో పర్యటన ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇక, కుప్పం-పలమనేరు జాతీయ రహదారి సమీపంలో శాంతిపురం మండల పరిధిలోని కడపల్లె, కనమలదొడ్డి గ్రామాల మధ్య శివపురం దగ్గర చంద్రబాబు ఇల్లు కోసం స్థలం తీసుకున్నారని.. త్వరలోనే భూమి పూజలు చేసి.. నిర్మాణ పనులు ప్రారంభిస్తారని తెలుస్తుంది. అయితే, చంద్రబాబు ఇల్లు కట్టినా గెలిచేది లేదని జోస్యం చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి..
Read Also: Minister Peddireddy: ఇసుక పాలసీపై తప్పుడు ప్రచారం..!
ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణంపై కూడా స్పందించారు.. కుప్పంలో చంద్రబాబు ఇల్లు కట్టినా.. చివరకు బంగారం నాణేలు పంపిణీ చేసినా గెలవలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో తన నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు గెలిచినా.. మెజార్టీ భారీగా తగ్గింది.. ఇక, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో.. టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. మెజార్టీ స్థానాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుచుకోవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, ఈ ఎన్నికల్లో వైసీపీ తరుఫున మంత్రి పెద్దిరెడ్డి కీలకంగా పనిచేసిన విషయం విదితమే.