విద్యావిధానంలో మార్పుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగుతున్నాయి.. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లీష్ మీడియంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. నూతన విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష నిర్వహించారు.. విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు.. వాటి అమలు తీరును సీఎంకు వివరించిన అధికారులు. నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఇప్పటివరకు మ్యాపింగ్ కాకుండా మిగిలిన స్కూళ్లను కూడా మ్యాపింగ్ చేశామని అధికారులు తెలిపారు.. […]
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే విదేశీ పర్యాటకురాలిపై నెల్లూరు జిల్లాలో అత్యాచారయత్నం కలకలం సృష్టించింది.. అయితే, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఏపీ పోలీసులు…గంటల వ్యవధిలోనే అత్యాచాయత్నానికి పాల్పడిన దుండగులను అరెస్ట్ చేశారు. ఇక, ఈ ఘటనపై స్పందించిన బాధితురాలు కరోలినా.. ఇండియా చూద్దామని వచ్చా.. కానీ, ఇలా జరుగుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. చెన్నై నుంచి గోవాకు వెళ్తుండగా సాయి కుమార్ (నిందితుడు) పరిచయమయ్యాడని తెలిపిన ఆమె… ఆ తర్వాత సైదాపురం వద్ద నాపై […]
సీఎం కేసీఆర్.. అసెంబ్లీలో బడ్జెట్ పై ప్రసంగించబోతున్నారు. నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతున్నారు.. అందరూ తన ప్రసంగం వినాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీపై.. నిరుద్యోగుల్లో మొదటి నుంచి అసంతృప్తి ఉంది. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అని ప్రచారం చేశారని… ఈ హామీ నిలబెట్టు కోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇటు విపక్షాలు, అటు నిరుద్యోగులు ఆందోళనబాటలో ఉన్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది తెలంగాణ ఉద్యమ స్లోగన్. ఇందులో మొదటి రెండింటి విషయంలో న్యాయం జరిగిందన్న […]
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతుండడంతో మనదేశంలోనూ… పెట్రో మంట రేగడం ఖాయంగా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమయ్యాయి కంపెనీలు. ఏ నిమిషంలోనైనా ప్రకటన రావొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ పై లీటర్‌కు 10 నుంచి 15 రూపాయల వరకు పెరగొచ్చని అంచనాలున్నాయి. ధరల పెరుగుదల ప్రపంచ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం […]
పసిడి ధరలు భగ్గుమంటున్నాయి.. సామాన్యులకు అందనంత ఎత్తుకు ధరలు ఎగబాకుతున్నాయి.. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం, అంతర్జాతీయ పరిస్థితులతో బంగారం ధరలకు పట్టపగ్గాల్లేకుండా పోతోంది. ధరలు 19 నెలల గరిష్టానికి చేరాయి. కమోటిటీ ఫ్యూచర్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం 54 వేల మార్క్ ను తాకింది. ఇంట్రాడేలో 54,190 రూపాయలకు వెళ్లింది. 24 క్యారెట్ల తులం బంగారం.. ఆల్ టైమ్ గరిష్టానికి 2వేల దూరంలో నిలిచిపోయింది. 2020 ఆగస్టులో 56,191 రూపాయలను తాకింది. ఇప్పటివరకు ఇదే జీవితకాల […]
త్వరలోనే ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. తాము కూడా ఎన్నికలు రెడీగా ఉన్నామని చెప్పారు. నెత్తిమీద కుంపటిని దించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమన్నారు చంద్రబాబు. రేపో ఎల్లుండో సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారన్న చంద్రబాబు.. రోజు రోజుకూ పతనావస్థకు వెళ్తున్నారని.. మరిన్ని రోజులు గడిస్తే వ్యతిరేకత పెరుగుతుందని సీఎం భయపడుతున్నారని తెలిపారు.. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా […]
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలపై స్పందించారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి. ధరలు ప్రపంచ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయన్నారు. ఎన్నికల కోసమే ధరలు పెంచకుండా ఆపారన్న ప్రతిపక్షాల విమర్శలు కొంతవరకు నిజమే కావొచ్చన్నారు. ధరల పెంపుపై ఆయిల్ కంపెనీలే నిర్ణయం తీసుకుంటాయన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుందన్నారు హర్దీప్ సింగ్ పురి. ఇక, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో దేశంలో ముడి చమురు కొరత ఉండదని, చమురు కంపెనీలే ఇంధన ధరలను నిర్ణయిస్తాయని […]
ఉక్రెయిన్‌పై యుద్ధం రష్యాకు భారంగా మారింది. ప్రపంచ దేశాలు విధిస్తోన్న ఆంక్షలకు రష్యా అల్లాడిపోతోంది. వ్యాపారాలు ఊహించని స్థాయిలో దెబ్బతిన్నాయి. ప్రస్తుతం రష్యాపై 5వేలకు పైగా ఆంక్షలుండగా… అందులో 2,700కు పైగా గత 10 రోజుల్లో విధించినవే. ప్రపంచంలో నార్త్ కొరియా, ఇరాన్ లాంటి దేశాల కంటే రష్యాపైనే ఎక్కువ ఆంక్షలు అమలవుతున్నాయి. మరోవైపు మల్టీ నేషనల్ కంపెనీలన్నీ యుద్ధానికి నిరసనగా రష్యాలో తమ ఆపరేషన్స్ ఆపేశాయి. కొన్ని కంపెనీలైతే రష్యా మార్కెట్ నుంచి పూర్తిగా వెళ్లిపోతున్నట్టు […]
వనపర్తిలో జరిగిన బహిరంగసభలో.. రేపు ఉదయం కీలక ప్రకటన చేస్తాను.. రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు అంతా టీవీలు చూడండి అంటూ ప్రకటించి అందరిలో ఆసక్తిపెంచారు సీఎం కేసీఆర్.. ఇక, దీనిపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ కోటమిరెడ్డి వెంకట్‌రెడ్డి.. రేపు నిరుద్యోగుల కోసం ఉదయం 10 గంటలకు ప్రకటన చేస్తానని కేసీఆర్ అనడం సంతోషాన్ని కలిగించింది.. రాష్ట్ర ప్రజలలో ఒకడిగా నేను రేపటి మీ ప్రకటన కోసం వేచి చూస్తున్నాను అన్నారు.. మీ 2018 ఎన్నికల […]
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు.. అయితే, సీఎం పర్యటనకు మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు డుమ్మా కొట్టారు.. సీఎం కార్యక్రమానికి పూర్తిగా దూరంగా ఉన్నారు జూపల్లి… అంత వరకు లైట్‌గా తీసుకోవచ్చేమో.. కానీ, ఇదే సమయంలో ఖమ్మంలో టీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పిడమర్తి రవితో జూపల్లి ప్రత్యేకంగా చర్చలు జరపడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా […]