Gas Cylinder Update: అలర్ట్.. అలర్ట్.. ఈ-కేవైసీ లేకుంటే నో బుకింగ్..!
- గ్యాస్ వినియోగదారులకు కీలక హెచ్చరిక
- ఈ-కేవైసీ తప్పనిసరి.. లేకుంటే బుకింగ్ నిలిపివేత
- సిలిండర్ బుకింగ్‌పై కొత్త 25 రోజుల నిబంధన
- కమర్షియల్ గ్యాస్ సరఫరాపై కఠిన నియంత్రణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gas Cylinder Update: గ్యాస్ వినియోగదారులకు పెట్రోలియం కంపెనీలు, ప్రభుత్వం అత్యంత కీలకమైన హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని, లేనిపక్షంలో సిలిండర్ బుకింగ్ సౌకర్యాన్ని తక్షణమే నిలిపివేస్తామని స్పష్టం చేశాయి. అర్హులైన వారికే సబ్సిడీ అందేలా చూడటంతో పాటు అక్రమ కనెక్షన్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండాలంటే సింపుల్ చిట్కా..!
Also Read
- Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
- Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
వినియోగదారులు తమ గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా లేదా ఆన్‌లైన్ యాప్స్ సాయంతో ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనికి తోడు, గృహ వినియోగ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు బుకింగ్ వ్యవధిని కూడా సవరించారు. ఇప్పుడు ఒక సిలిండర్ పొందిన తర్వాత రెండో సిలిండర్ బుక్ చేసుకోవడానికి కనీసం 25 రోజుల సమయం ఉండాలని నిబంధన విధించారు.
Team India Schedule 2026: టీమిండియా మళ్లీ మైదానంలోకి వచ్చేది అప్పుడే.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
మరోవైపు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా కమర్షియల్ గ్యాస్ సరఫరాపై పెట్రోలియం కంపెనీలు కఠినమైన నియంత్రణలను అమలులోకి తెచ్చాయి. గ్యాస్ నిల్వలు తగ్గిపోవడంతో ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేయాలని డీలర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా హోటళ్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయించారు. అత్యవసర సేవలను దృష్టిలో ఉంచుకుని కేవలం ఆస్పత్రులు, విద్యా సంస్థల హాస్టళ్లకు మాత్రమే గ్యాస్ సరఫరా చేయాలని కంపెనీలు స్పష్టం చేశాయి.
ఈ నిర్ణయం వల్ల హోటల్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. వినియోగదారులు ఈ మార్పులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా గృహ వినియోగదారులు గ్యాస్ నిలిపివేత సమస్య తలెత్తకుండా వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!