బీజేపీ చిల్లర ఆటలు ఇక సాగవు.. సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లినా ఏమీ జరగదని స్పష్టం చేశారు మంత్రి జగదీష్‌రెడ్డి… సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీలో సస్పెన్షన్ గురైన బీజేపీ శాసనసభ్యులు న్యాయపోరాటం చేస్తామనడంపై మండిపడ్డారు.. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో బాధ్యతలేని ప్రతిపక్షాలు ఉన్నాయని విమర్శించిన ఆయన.. ప్రజరంజక పాలన అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు సభను అడ్డుకుంటున్నాయన్నారు. Read Also: Roja Vs Atchannaidu: రోజాకు ఛాలెంజ్.. ఆమె గెలిస్తే […]
ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీకి 160 సీట్లు వస్తాయంటూ అచ్చెన్నాయుడు పెద్ద జోక్ చేశారని ఎద్దేవా చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. తిరుపతి ఎంపీ ఎన్నికల సమయంలో ‘పార్టీ లేదు.. తొక్కా లేదు’ అన్న వ్యక్తి ఇప్పుడు 160 సీట్లంటూ జోక్ చేస్తున్నారని.. గట్టి చట్నీ గట్టిగా తింటే అచ్చెన్నాయుడు 160 కిలోలు పెరుగుతారేమోగానీ.. నువ్వు గానీ చంద్రబాబు నాయుడు గానీ తలకిందులుగా తపస్సు చేసినా 160 సీట్లు కాదు కదా.. ఇప్పుడున్న 23 సీట్లు […]
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ 2022-23 సమావేశాలు ప్రారంభం అయిన రోజే బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది.. బడ్జెట్ సెషన్ మొత్తం బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ అధికార పార్టీ తీర్మానం పెట్టడం.. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి దానికి ఆమోదం తెలపడం జరిగిపోయాయి.. అయితే, ముగ్గురు బీజేపీ సభ్యుల సస్పెన్స్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ పిటిషన్ దాఖలు చేశారు.. రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనలకు […]
ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా శాంతి చర్చలు సాగుతూనే ఉన్నాయి… రెండో దశల్లో చర్చలు విఫలం అయ్యాయి.. ఇక, మంగళవారం రోజు మూడో దఫా చర్చల్లో కాస్త పురోగతి కనిపించింది.. మూడో దఫా శాంతి చర్చలు కూడా ఎటూ తేలకుండానే ముగిసినట్టు చెబుతున్నారు.. బెలారస్ వేదికగా మూడోసారి సమావేశమైన ఇరుదేశాల ప్రతినిధులు… ఎలాంటి ముందడుగు వేయలేకపోయారని అంటున్నా.. చర్చల్లో కొంత పురోగతి సాధించినట్లు ఉక్రెయిన్ ప్రతినిధులు తెలిపారు.. అయితే, చర్చలు సానుకూల దృక్పథంతో సాగాయని ఉక్రెయిన్ […]
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో లేఖ విడదలైంది.. మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలకు ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించిన మావోయిస్టులు.. జీకే వీధి మండలం చాపరాతి పాలెంలో జరుగుతున్న మైనింగ్‌ను తరిమి కొట్టాలని పేర్కొన్నారు.. పార్టీలకు పదవులకు రాజీనామా చేసి మన్యం విడిచిపోవాలని హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో […]
శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావులను… స్పీకర్ సస్పెండ్ చేశారు. బడ్జెట్ ప్రసంగానికి బీజేపీ సభ్యులు అడ్డు తగిలారంటూ… మంత్రి తలసాని తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని ఆమోదించిన సభాపతి… ముగ్గురిపై ఈ సమావేశాల ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. ముగ్గురు ఎమ్మెల్యే సస్పెన్షన్‌పై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైరయ్యారు. రెండు నిమిషాల్లోనే అంతా జరిగిపోయిందన్నారు. ఇక, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా… రాజ్యాంగాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని బీజేపీ సభ్యులు […]
ఆపరేషన్ గంగ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వరకు 73 విమానాల్లో 15,206 మందిని భారత్ తీసుకొచ్చినట్టు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. అలాగే 10 ఎయిర్‌ఫోర్స్ విమానాల్లో 2056 మందిని తరలించినట్టు తెలిపింది. సోమవారం 7 విమానాల్లో 1314 మంది భారత్ వచ్చినట్టు వివరించింది. మొత్తంగా ఫిబ్రవరి 22న ఆపరేషన్ గంగ మొదలైనప్పట్నుంచి ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి 17,400 మందికి పైగా భారతీయులను సొంత దేశానికి తరలించామని వివరించింది. మంగళవారం మరో 2 విమానాలు భారత్ […]
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం కె.చంద్రశేఖర్ రావు.. సమాజంలో పురుషుడితో పాటుగా అన్ని రంగాల్లో మహిళలు సమాన పాత్ర పోశిస్తున్నారని పేర్కొన్న ఆయన.. కుటుంబ అభివృద్ధిలో గృహిణిగా స్త్రీ పాత్ర ఎంతో గొప్పదని, త్యాగపూరితమైందన్నారు.. అన్నీతానై కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ అందరి ఆలనా పాలనా చూసే ఒక తల్లి కనబరిచే ప్రాపంచిక దృక్పథాన్ని, దార్శనికతను మానవీయ కోణాన్ని.. తన పాలనలో అన్వయించుకుని తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని స్పష్టం చేశారు.. మానవ […]
విశాఖ మన్యంలో మావోయిస్టుల తాజా లేఖ కలకలం రేపుతోంది… అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని హెచ్చరిస్తూ లేఖ రాశారు మావోయిస్టులు.. లేట్రైట్ మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలకు ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించిన మావోయిస్టులు.. జీకే వీధి మండలం చాపరాతి పాలెంలో జరుగుతున్న మైనింగ్‌ను తరిమి కొట్టాలని లేఖ విడుదల చేశారు.. పార్టీలకు పదవులకు రాజీనామా చేసి మన్యం విడిచిపోవాలని లేఖలో డిమాండ్ చేసింది మావోయిస్టు పార్టీ […]