Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కొన్ని అంశాలపై వెంటనే స్పందిస్తారు.. తక్షణమే పరిష్కార మార్గం చూపిస్తారు.. ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ విషయం స్పష్టమైంది.. ఇప్పుడు.. పోలవరం నియోజకవర్గ ప్రజల రెండు దశాబ్దాల రోడ్డు సమస్యకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పెద్దపీట వేశారు. ఐ.ఎస్. జగన్నాథపురం పర్యటన సందర్భంగా ప్రజలు వినిపించిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుని, మొత్తం రూ. 7 కోట్లు 60 లక్షల నిధులను మంజూరు చేశారు.
Read Also: KA Paul: మీరు వీవీవీఐపీ కావొచ్చు.. నేను అంతకంటే వీవీవీఐపీని.. కేఏ పాల్ వార్నింగ్..
పోలవరం నియోజకవర్గంలోని తిమ్మనకుంట–గవరవరం రోడ్డు గత 20 ఏళ్లుగా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. రోజూ ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళ ఒకరు పవన్ కల్యాణ్‌కు పర్యటనలో విన్నవించుకున్నారు. ఆమె ఆవేదన విన్న పవన్ వెంటనే స్పందించి.. 9 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 7 కోట్లు అనుమతి ఇచ్చారు. పల్లె పండగ 2.0 కింద సాస్కీ నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.
ఇక, యర్రంపేట ప్రాంత రైతులు పంట పొలాలకు రాకపోకలు, రవాణా, మార్కెటింగ్ సమస్యలు ఎదుర్కొంటున్నారని పవన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి.. పంట పొలాల మధ్య 3 కిలో మీటర్ల డొంక రోడ్డు నిర్మాణానికి రూ. 60 లక్షలు మంజూరు చేశారు. రైతుల అవసరాలు, గ్రామాల కనెక్టివిటీ, రవాణా సౌకర్యం—ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పవన్ కల్యాణ్ ఫీల్డ్ విసిట్స్‌లో వచ్చిన సమస్యలను అత్యంత వేగంగా పరిష్కరిస్తున్నారు. కాగా, పర్యటనల్లో ప్రజలు చెప్పిన సమస్యలు వెంటనే పరిష్కార దిశగా వెళ్లడం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని పాలనలో వేగం, బాధ్యతను స్పష్టంగా చూపుతోంది. రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు ప్రజల్లో హర్షాన్ని కలిగించింది.